బీసీల కోసం ఢిల్లీతో పోరు | Kavitha Fight’s with Delhi for BC Reservations

స్థానిక సంస్థల్లో బీసీ లకు రిజర్వేషన్ల విషయంలో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు మోసపూరిత వైఖరితో కాలం వెళ్లదీస్తున్నాయి. 50 శాతానికి పైగా జనాభా ఉన్న బీసీలకు న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి ఆయా పార్టీల్లో ఏ మాత్రం కనిపించటం లేదు. ఈ అంశంలో చిత్తశుద్ధితో పోరాడుతున్న నాయకురాలెవరైనా ఉన్నారంటే జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాత్రమే. ఈ అంశాన్ని ఎత్తుకున్న నాటి నుంచి అనుక్షణం ఆ దిశగా అవకాశం ఉన్న అన్ని వేదికల్లో తన గొంతు వినిపిస్తున్నారు. కానీ నిజంగా సమస్యను పరిష్కరించ గలిగే అవకాశం ఉన్న కాంగ్రెస్, బీజేపీ లు మాత్రం ఒకరిపై ఒకరు నెపం నెట్టేసుకుంటూ టైమ్ పాస్ చేస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా బీసీ రిజర్వేషన్ల పై బరిగీసి కొట్లాడాల్సిన బీఆర్ఎస్ మాత్రం ఈ అంశంతో తనకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది. దీంతో ఈ మూడు పార్టీల బండారాన్ని బయట పెట్టే బాధ్యతను కవిత గారు తన భుజాలపై వేసుకున్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో వీరు చేస్తున్న డ్రామాను ఎప్పటికప్పుడు ప్రజల ముందుంచుతున్నారు. 

కామారెడ్డి లో బీసీ డిక్లరేషన్ ప్రకటించి కాంగ్రెస్ పార్టీ బీసీల ఓట్లు కొల్లగొట్టింది. ఆ తర్వాత ఈ విషయాన్ని మర్చిపోయింది. ఆ పార్టీ ఇచ్చిన హామీలపై ఒత్తిడి తేవాల్సిన బీఆర్ఎస్ సైతం గమ్మునుండిపోయింది. దీంతో కాంగ్రెస్ కొద్ది రోజులు ఊపిరి పీల్చుకుంది. కానీ వారికి కొరక రాని కొయ్యగా మారారు కల్వకుంట్ల కవిత. నిరంతరం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను వారికి గుర్తు చేస్తూ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చే పని మొదలుపెట్టారు. దీంతో ఈ అంశం నుంచి తప్పించుకుందామనుకున్న కాంగ్రెస్ ఎటూ పాలు పోని పరిస్థితి ఏర్పడింది. నిరంతరం బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కాంగ్రెస్ కు గుర్తు చేస్తూ కవిత రెండేళ్లుగా చాలా పోరాటాలే చేశారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి బీసీలను జాగృతం చేశారు. రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం పై అన్ని వర్గాలు ఒత్తిడి తెచ్చేలా కార్యక్రమాలు నిర్వహించారు. 72 గంటల నిరాహార దీక్ష తో పాటు పలు కార్యక్రమాలు చేశారు. బీసీ బిల్లు కోసం రైల్ రోకో కూడా నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  దీంతో ప్రభుత్వం పై ఒత్తిడి పెరిగింది. ఫలితంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయాల్సి వచ్చింది. 

కవిత గారి డిమాండ్ ఫలితంగా కాంగ్రెస్ పార్టీ రెండు బిల్లులు తీసుకురావాల్సిన వచ్చింది. కాంగ్రెస్ పై ఒత్తిడి పెట్టటంతో ఏదో కంటి తుడుపు చర్యగా బిల్లు పెట్టారు. ఇక్కడే బీజేపీ నాటకం కూడా బయట పడింది. కాంగ్రెస్ తెచ్చిన బిల్లులను అమలు చేయించాల్సి కాషాయం పార్టీ నేతలు అది తమ పని కాదన్నట్లుగా మిన్నుకుండిపోయారు. తెలంగాణ ప్రజలు 8 ఎంపీ సీట్లు గెలిపించినప్పటికీ ఆ కృతజ్ఞత కూడా చూపించలేదు. 

బీసీ బిల్లు విషయంలో కాంగ్రెస్, బీజేపీ దొందు దొందే అన్నట్లుగా వ్యవహారం నడిపించాయి. కనీసం వారి బండారాన్ని బయట పెట్టాల్సిన బీఆర్ఎస్ కూడా వారి పాపంలో పాలు పంచుకుంటోంది. ఎక్కడ కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టే కార్యక్రమాలు చేపట్టటం లేదు. 

చివరకు సర్పంచ్ ఎన్నికల్లో బీసీ లకు గతంలో కన్నా తక్కువ రిజర్వేషన్లు ఇచ్చేలా జీవో 46 ను తీసుకొచ్చినప్పటికీ బీఆర్ఎస్ నుంచి రావాల్సినంత నిరసన రావటం లేదు. ఇప్పటికీ కూడా కవిత గారు మాత్రమే ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకొని పోరాటం చేస్తున్నారు. కవిత పోరాట ఫలితంగానే బీసీ బిల్లు పై కనీసం బీజేపీ, బీఆర్ఎస్ నేతలు అప్పుడప్పుడు ప్రకటనలు చేయాల్సిన పరిస్థితి వస్తోంది. నిజంగా బీసీ ల విషయంలో పార్టీలకు చిత్తశుద్ది ఉంటే చేయగలిగే స్థానంలో ఉండి బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అఖిలపక్షాన్నిఢిల్లీకి తీసుకెళ్లటం లేదు. ఇక బీఆర్ఎస్ ఎందుకు చేతులెత్తేసింది. అంటే కేవలం బీసీలను మభ్య పెట్టి రాజకీయంగా వాడుకునేందుకు ప్రధాన పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయన్నది స్పష్టమవుతోంది. 

కానీ కవిత గారు మాత్రం అలా కాదు. తాను ఒక అంశాన్ని ఎత్తుకున్నారంటే అది పూర్తయ్యే వరకు వదిలి పెట్టని నైజాం ఆమెది.  బీసీ రిజర్వేషన్ల విషయంలో కూడా ఆమె అంతే కమిట్ మెంట్ తో ఉన్నారు. అందుకే బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ మోసాన్ని ఎప్పటికప్పుడు ఎండగతూనే ఉన్నారు. 

2025 నవంబర్ 25న కామారెడ్డిలో రైల్ రోకో నిర్వహించారు. బీసీల అంశంలో ఢిల్లీకి మెసేజ్ ఇచ్చేందుకు ఆమె రైల్ రోకో నిర్వహించారు. బీజేపీ ఎంపీలు రాజీనామా చేసి బీసీలకు రిజర్వేషన్లు వచ్చేందుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. 

నిజానికి కవితకు ఉన్న కమిట్ మెంట్ లో పదో వంతు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లకు ఉండి ఉంటే బీసీ లకు ఎప్పుడో రిజర్వేషన్లు వచ్చేవి. బీసీలకు ద్రోహం చేస్తున్న అంశంలో ఈ పార్టీలు ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ ఏమీ కాదు. గతంలో బీఆర్ఎస్ బీసీలను ముంచితే ఇప్పుడు ఆ పాపకార్యాన్ని కాంగ్రెస్ కొనసాగిస్తోంది. ఇక బీజేపీ చేయగలిగే స్థితిలో ఉండి కూడా మొసలి కన్నీరు కారుస్తోంది. నిజంగా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ గట్టిగా అనుకుంటే రాష్ట్రంలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు న్యాయం జరగటం పెద్ద విషయమేమీ కాదు. కానీ ప్రధాన పార్టీలకు ఆ చిత్తశుద్ది లోపించింది. 

ఒక్క కవిత మాత్రమే ఈ విషయంలో ఛాంపియన్ గా పోరాడుతున్నారు. ఎక్కడికి వెళ్లిన బీసీ ద్రోహ పార్టీలను నిలదీస్తున్నారు. ఓ వైపు ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు. మరో వైపు బీసీలందరినీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తన సామాజిక తెలంగాణ లక్ష్యంలో భాగంగా బీసీలకు రిజర్వేషన్లు అనేది పెద్ద ముందడుగు అవుతుందని కవిత భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంతో కమిట్ మెంట్ తో పోరాటం చేస్తున్నారు. 

కవిత నుంచి ఈ స్థాయిలో అన్ని పార్టీల మీద ఒత్తిడి లేకపోయి ఉంటే కచ్చితంగా బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టేవాళ్లే.

ఇక తప్పించుకోవటానికి అవకాశం లేని పరిస్థితిని కవిత తీసుకొస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అసలు రంగును ఆమె బయటపెట్టారు. దీంతో డ్యామేజ్ కంట్రోల్ చేసుకునేందుకు ఈ మూడు పార్టీలు బీసీ రిజర్వేషన్ల వాదాన్ని వినిపిస్తున్నాయి. ఐతే రిజర్వేషన్లు సాధించే వరకు కవిత గారు ఎలాగు పోరాటం చేస్తారు కనుక తప్పని సరి పరిస్థితుల్లో అన్ని పార్టీలు ఈ విషయంలో సీరియస్ గా ఉండాల్సిందే. కనుక కచ్చితంగా భవిష్యత్ లో బీసీ లకు స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో రిజర్వేషన్లు రావాల్సిందే. ఆ పోరాటం లో కవితే ఛాంపియన్ గా ఉండటం తథ్యం.