కొత్త సర్పంచులకు హితవు | (జాగృతి కార్యాలయం, హైదరాబాద్)
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ లుగా గెలిచిన నాయకులు అంకితభావంతో గ్రామప్రజల సేవలో ఉండాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.
నిజామాబాద్ జిల్లాలో సర్పంచులుగా గెలిచిన పలువురు తెలంగాణ జాగృతి నాయకులు బుధవారం హైదరాబాద్ లోని జాగృతి కార్యాలయంలో కల్వకుంట్ల కవితను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని కవిత సత్కరించి అభినందనలు తెలిపారు. ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి వారి సమస్యలపై దృష్టిపెట్టి పరిష్కరించాలని సూచించారు.










