44 కమిటీలు ఏర్పాటు చేసిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత | హైదరాబాద్ :
తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి రూపొందించబోయే బ్లూ ప్రింటులో భాగంగా మరో 12 కమిటీలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే 32 కమిటీలను ప్రకటించిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు గురువారం అదనంగా మరో 12 కమిటీలు ఏర్పాటు చేశారు. మొత్తం 44 కమిటీల ద్వారా ఆయా రంగాల్లో స్టడీ చేయనున్నారు.
ఎక్స్ సర్వీస్ మెన్ సంక్షేమం, గిగ్ వర్కర్స్ సంక్షేమం, జర్నలిస్టుల సంక్షేమం, వికలాంగుల సంక్షేమం – సాధికారత, బిజినెస్/ఎంఎస్ఎంఈ, స్పోర్ట్స్, పబ్లిక్ ట్రాన్స్ పోర్టేషన్ – రోడ్స్ – ఇన్ ఫ్రా స్ట్రక్షర్, ఎన్విరాన్మెంటల్ – ఫారెస్ట్, అర్బన్ ప్లానింగ్, హౌసింగ్, దేవాదాయ – అన్ని మతాల ప్రార్థన మందిరాల అభివృద్ధి, ఎనర్జీ – గ్రీన్ ఎనర్జీ రంగాల్లో కమిటీలు ఏర్పాటు చేశారు. ఒకో కమిటీలో ముగ్గురు నుంచి నలుగురు సభ్యులను నియమించారు. ఈ కమిటీల సభ్యులు ఆయా రంగాల్లో స్టడీ చేసి తమ నివేదికలను ఈనెల 17 వరకు ఎల్. రూప్ సింగ్, సయ్యద్ ఇస్మాయిల్, లోక రవిచంద్ర, వరలక్ష్మి సభ్యులుగా ఉన్న స్టీరింగ్ కమిటీకి అందజేయాలని సూచించారు.








