తెలంగాణ ఉద్యమకారుల రిజిస్ట్రేషన్ ఫార్మ్

తెలంగాణ కోసం తమ జీవితాలను అంకితం చేసిన ఉద్యమకారుల గాధ నేటికీ అరణ్యరోదనగానే మిగిలిపోయింది.

ఉద్యమ కాలంలో లాఠీ దెబ్బలు తిన్న వారు, జైళ్లలో మగ్గిన వారు, ఉద్యోగాలు కోల్పోయిన వారు, కుటుంబాలను దూరం పెట్టి ఉద్యమానికి అండగా నిలిచిన వారు ఈ రోజు ఎవరి గమనికలోనూ లేకుండా, ఎవరి ప్రశ్నకూ సమాధానం లేని స్థితిలో జీవిస్తున్నారు.

రాష్ట్రం వచ్చిందనే ఆనందం క్షణకాలమే. ఆ తర్వాత 11 సంవత్సరాలుగా ఉద్యమకారుల జీవితాల్లో మాత్రం మార్పు రాలేదు. ఏ పార్టీ తలుపు తట్టినా నిరాశే ఎదురైంది.

“మీ త్యాగం చరిత్ర” అని చెప్పి, మీ సమస్యలను మాత్రం చరిత్రలోనే పూడ్చేశారు.

ఈ మౌనవేదనను, ఈ అగచాట్లను, ఈ అన్యాయాన్ని చూసి చలించిపోయిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు, ఉద్యమకారుల గుండె చప్పుడు వినాలనే సంకల్పంతో, పార్టీ అధ్యయన కమిటీలలో “ఉద్యమకారుల సంక్షేమ కమిటీ” అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు.

ఇది ఒక కమిటీ మాత్రమే కాదు — ఇది న్యాయం కోసం ఎదురు చూస్తున్న వేలాది కుటుంబాల ఆశ.

తొలిదశ మరియు మలిదశ ఉద్యమంలో పాల్గొని నేడు సమస్యలతో సతమతమవుతున్న ప్రతి ఒక్క ఉద్యమకారుడు, మీ బాధను మౌనంగా మింగేయకండి. మీ గళాన్ని మీరే వినిపించండి.

మీ ఉద్యమ ప్రస్థానం, మీ త్యాగం మరియు ఉద్యమ సమయంలో మీపై పెట్టిన కేసుల వివరాలు క్రింద నమోదు చేయండి.

Please enable JavaScript in your browser to complete this form.