బీఆర్ఎస్, బీఎస్పీకి షాక్

టీఆర్ఎస్‌లోకి బోథ్ నియోజకవర్గ ఆదివాసీ నాయకులు

(తెలంగాణ రక్షణసేన, హైదరాబాద్ ):

బోథ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్, బీఎస్పీ లకు షాక్ తగిలింది. ఆ పార్టీ లోని ఆదివాసీ సీనియర్ నాయకులు టీఆర్ఎస్ లో చేరారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ టీఆర్ఎస్ కార్యాలయంలో  శనివారం జరిగిన కార్యక్రమంలో వారంతా పార్టీలో చేరారు. బోథ్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు ఆధ్వర్యంలో తలమడుగు మండలానికి చెందిన ఆదివాసీ నాయకులు హైదరాబాద్ చేరుకున్నారు. పార్టీ సీనియర్ నేత రూప్ సింగ్ సమక్షంలో పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి రూప్ సింగ్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కవిత. నాయకత్వం మీద విశ్వాసంతో వారంతా టీఆర్ఎస్ లోకి వచ్చారన్నారు. ఆదివాసీల అభ్యున్నతి కోసం కవిత ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారని చెప్పారు. తెలంగాణ అస్తిత్వం, అభివృద్ధి లక్ష్యంగా టీఆర్ఎస్ పనిచేస్తుందన్నారు. టీఆర్ఎస్ సిద్ధాంతాలు, నాయకత్వంపై విశ్వాసంతో పార్టీలో చేరిన వారందరికీ రూప్ సింగ్ కృతజ్ఞతలు చెప్పారు. రానున్న రోజుల్లో బోథ్ నియోజకవర్గంలో టీఆర్ఎస్‌ను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో గజన, దేవర్ల స్వామి, రమేష్, నాయిని శ్రీనివాస్, తీగల ప్రకాష్, శ్రీనివాస్ పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.