మల్కాజిగిరి నియోజకవర్గంలోని బండ చెరువు ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరిశీలించారు. చెరువు అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. రైల్వే అండర్ పాస్ నిర్మించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు.

“ఇక్కడున్న బండ చెరువు చాలా పెద్ద చెరువు. కానీ కబ్జాలకు గురై చిన్నగా అవుతోంది. చెరువులో గుర్రపు డెక్క పెరిగిపోవటంతో చుట్టు పక్కల ప్రజలు దోమల బెడదతో ఇబ్బంది పడుతున్నారు. చెరువు చుట్టు ఫెన్సింగ్ పూర్తి కాకపోవటంతో ఇక్కడే చెత్త వేస్తున్నారు. ఇక్కడేమో విచిత్ర పరిస్థితి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు. ప్రభుత్వం మాత్రం కాంగ్రెస్ ది ఉంది. మైనంపల్లి హన్మంతన్నదే ఇక్కడ నడుస్తుందంటున్నారు. ఎమ్మెల్యే గారు కానీ మైనంపల్లి గారు గానీ ప్రజల సమస్యలు తీర్చాలి. మల్కాజ్ గిరి నియోజకవర్గంలో రైలుపట్టాల దగ్గర అండర్ పాస్ లు నిర్మించాల్సి ఉంది. ఎంపీ ఈటల గారు రైల్వే అండర్ పాస్ లు పూర్తి చేయించాలి.”

“2014 నుంచి ఇక్కడ శిలాఫలాకలు ఉన్నాయి. ఈటల గారు కేంద్రంపై ఒత్తిడి పెంచి పనులు చేయించాలి.
కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు కూడా పూర్తి చేయాల్సి ఉంది. చెరువు ఓవర్ ఫ్లో అయినప్పుడు ఇక్కడ నీళ్లన్నీ వెనక్కి తన్ని కాలనీలు మునిగిపోతున్నాయి. ప్రజల సమస్య తీర్చాలని అన్ని పార్టీల నాయకులను కోరుతున్నాం. ఈ సమస్య తీరే వరకు మా జాగృతి నాయకులు పట్టు పట్టి పనిచేస్తారని హామీ ఇస్తున్నా.”