జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా మేడ్చల్- మల్కాజ్ గిరి జిల్లాలో తేదీ 05-12-2025 రోజున జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రెండో రోజు పర్యటించారు. ఈ సందర్భంగా పరికి చెరువుతో పాటు స్థానిక ప్రాథమిక హెల్త్ సెంటర్ ను సందర్శించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బీసీ బిల్లు కోసం చనిపోయిన ఈశ్వరాచారిని పరామర్శించారు.

కుత్బుల్లాపూర్ లోని షాపూర్ నగర్ యూపీహెచ్ సీని సందర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు. యూపీహెచ్ సీ లో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. వంద పడకల హాస్పిటల్ చేస్తామని గతంలో చాలా మంది నాయకులు ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ…తక్షణమే హాస్పిటల్ ను నిర్మించాలని కోరారు.

“జనం బాటలో భాగంగా కుత్బుల్లాపూర్ లోని అర్బన్ ప్రైమరి హెల్త్ సెంటర్ ను ఇవ్వాళ పరిశీలించాం. 25 ఏళ్లుగా ప్రతి ఎమ్మెల్యే ఇక్కడ వంద పడకల హాస్పిటల్ కడతామని హామీ ఇస్తున్నారు. కానీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత టైమ్ పాస్ చేస్తున్నారు. ఆ పార్టీ, ఈ పార్టీ అని కాదు. అన్ని పార్టీల నాయకులు కూడా ఇలాగే చేస్తున్నారు. ఇక ఆశా వర్కర్లు, ఏఎన్ఎం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వారికి ఎగ్జామ్ పెట్టి కనీసం ఇప్పటి వరకు కూడా రిజల్ట్ ఇవ్వలేదు. అదే విధంగా గతంలో ఎప్పుడో రిక్రూట్ అయిన వాళ్లకు వాళ్ల సినియారిటీ ప్రకారం వెయిటేజ్ ఇవ్వాలి. ముఖ్యంగా ఏఎన్ఎం లకు సరైన సమయానికి జీతాలు ఇవ్వాలి. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలకు ట్యాబ్ లు ఇస్తామని ఇవ్వలేదు. అర్థరాత్రి అని కూడా చూడకుండా వాళ్లను రిపోర్ట్ పెట్టాలని కోరుతున్నారు.
దీంతో వాళ్లు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది”. అని ఆవేదన వ్యక్తం చేశారు.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పెరికి చెరువును పరిశీలించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు. 60 ఎకరాల్లో విస్తరించి ఉండాల్సిన చెరువు సగానికి పైగా కబ్జా కావడంపై ఆందోళన వ్యక్తం చేసిన జాగృతి అధ్యక్షురాలు.
“మేడ్చల్- మల్కాజ్ గిరి జిల్లాలో రెండో అతిపెద్ద చెరువైన పరికి చెరువును పరిశీలించాం. ఈ చెరువు 62 ఎకరాలు ఉంటే ఇప్పుడు మాత్రం 16 ఎకరాలకు కుదించుకుపోయింది. చుట్టు పక్కల వాళ్లు చెరువు పరిరక్షణ కోసం ఎన్నో కేసులు పెట్టారు. కానీ పొలిటికల్ మేనేజ్ మెంట్ చేస్తూ చెరువు తినేశారు. దీనిలో అన్ని పార్టీల వాళ్లు ఉన్నారు.
ఇప్పటికీ కూడా ఇక్కడ నిర్మాణంలో ఉన్న ఇళ్ల పహానీలు చూస్తే ఎఫ్టీఎల్ లో ఉన్నట్లు చూపిస్తున్నాయి. ఎఫ్టీఎల్ లో ఉన్నప్పటికీ నిర్మాణాలకు ఎలా అనుమతిస్తున్నారు? ఎఫ్టీఎల్ అని రాసి ఉన్న రాళ్లను కూడా రియల్ ఎస్టేట్ మాఫియా భయం లేకుండా తీసేసింది. హైడ్రా కమిషనర్ గారు కచ్చితంగా దీనిపై చర్యలు తీసుకోవాలి. ఇక్కడి ఎమ్మెల్యే గతంలో టీడీపీ లో ఉండి బీఆర్ఎస్ లోకి వచ్చారు. రేపు ఎక్కడ ఉంటారో తెలియదు?ఆయన అండదండలతోనే చెరువు కబ్జా జరిగింది. ఇప్పుడు నిర్మాణంలో ఉన్న చాలా ఇళ్లు ఎఫ్టీఎల్ లోనే కడుతున్నారు.

హైడ్రా కమిషనర్ గారు వాటిని కూల్చేయాలి. పేదవాళ్ల ఇళ్లే కాదు, పెద్ద వాళ్ల ఇళ్లను కూడా కూల్చేస్తామని మెసేజ్ ఇవ్వాలి. పరికి చెరువును హైడ్రా కమిషనర్ కాపాడాలని కోరుతున్నా. ఈ చుట్టు పక్కల అపార్ట్ మెంట్స్ ఉన్న ఉన్నాయి. వాటికి పార్క్ స్థలాన్ని రియల్ ఎస్టేట్ ఇవ్వాల్సి ఉంటుంది. మున్సిపల్ కు ఇవ్వాల్సిన గిఫ్ట్ డీడీని కూడా వాయిలేట్ చేస్తున్నారు. అయిన సరే మున్సిపల్ అధికారులు పట్టించుకోవటం లేదు. రియల్ ఎస్టేట్ మాఫియాతో ఎందుకు అంత అండర్ స్టాండింగ్ ఉందో చెప్పాలి?పరికి చెరువు కాపాడటంలో నేను ముందుంటాను. హైడ్రా కమిషనర్ గారు కూడా పరికి చెరువును కాపాడాలని కోరుతున్నా”. అని అన్నారు.

సూరారం కాలనీలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని మల్లంపేటలో తెలంగాణ జాగృతిలో చేరిన స్థానిక యువకులు, మహిళలు.. వారికి కండువా కప్పి జాగృతిలోకి ఆహ్వానించిన అధ్యక్షురాలు.
చర్చి గాగిల్లాపూర్ లో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను పరిశీలించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు. డబుల్ బెడ్రూం ఇండ్లు పూర్తి చేయకపోవడంతో అక్కడే చిన్న రేకుల ఇండ్లలో నివసిస్తున్న పేదలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఆత్మహత్య చేసుకున్న సాయి ఈశ్వర్ చారి భౌతిక ఖాయానికి నివాళులర్పించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు. సాయి ఈశ్వర్ చారి భార్య, తల్లి, పిల్లలను ఓదార్చిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు.

“సాయి ఈశ్వరాచారి ని బతికించుకోలేకపోయాం .. ఇది చాలా బాధాకరమైన విషయం. బీసీల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉదాసీనత కారణంగా ఇలా చేశాడని చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్రాల ద్రోహంపై మనం కొట్లాడాలి. కానీ ఇది పంథా కాదు. తెలంగాణ ఉద్యమంలోనే అనేక మందిని కోల్పోయాం. బీసీ రిజర్వేషన్లను బరిగీసి కొట్లాడి సాధించుకుందాం. ప్రాణాలు ఇవ్వటం మాత్రం సరికాదు. ఒక అక్కగా చేతులు ఎత్తి మొక్కి చెబుతున్నా. బీసీ రిజర్వేషన్లు సాధిస్తాం. గత రెండేళ్లుగా మనం కొట్లాడుతున్నాం. అందరి సమిష్టి పోరాటం కారణంగా బీసీ బిల్లులు వచ్చాయి. రాష్ట్రపతి వద్ద బిల్లులు ఉన్నాయి. ప్రజా పోరాటాల ద్వారా వాటిని సాధించుకుందాం. బీసీ బిల్లు ఘటం చివరి దశలో ఉంది. ప్రజా ఉద్యమాల ద్వారానే బిల్లు సాధ్యమవుతుంది. సాయి ఈశ్వరాచారి కుటుంబానికి మేమంతా అండగా ఉంటాం. ఆయనకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. సాయి ఈశ్వరాచారి కుటుంబానికి ప్రభుత్వం ఇల్లు కట్టి ఇవ్వాలి. వాళ్ల తమ్ముడికి ఉద్యోగం ఇస్తే కుటుంబాన్ని చూసుకుంటాడు. మళ్లీ చెబుతున్నా. చావు అనేది సొలుష్యన్ కాదు. ఆ వైపు ఆలోచన చేయవద్దని కోరుతున్నా. ఖచ్చితంగా బీసీ బిల్లు సాధిస్తామని హామీ ఇస్తున్నా. ఈశ్వరాచారి మరణం దురదృష్టకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. స్వర్ణకారులు తమ లక్ష్యం పట్ల ఎంతో కమిట్ మెంట్ తో ఉంటారు. తెలంగాణ ఉద్యమంలో కూడా శ్రీకాంతా చారి ప్రాణాలు అర్పించాడు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమం కోసం జీవితాన్ని ఫణంగా పెట్టారు. ఈశ్వరాచారి కూడా స్వర్ణకారుల వృత్తి చేశాడు. బీసీ బిల్లు కోసం ప్రాణాలు అర్పించాడు. అయితే ప్రాణాలు ఇచ్చే పంథా సరికాదని విజ్ఞప్తి చేస్తున్నా”. అన్నారు.