జాగృతి జనంబాట, వనపర్తి పర్యటన | Jagruthi Janam Bata Wanaparthy Visit

జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా వనపర్తిలో రెండు రోజుల పర్యటనలో మొదటి రోజు తేదీ 23-11-2025 జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పలు ప్రాంతాల్లో పర్యటించారు. కొత్త కోటలో చేనేత కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకన్నారు. వనపర్తి హాస్పిటల్ ను పరిశీలించారు. కొత్తకోట – కానాయిపల్లి శంకర సముద్రం రిజర్వాయర్ సందర్శించి నిర్వాసితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 

చేనేత కార్మికులతో సమావేశం

కొత్తకోటలో చేనేత కార్మికులతో మాట్లాడి చీరలు, వస్త్రాలు నేయడం గురించి తెలుసుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు. 

“నాగరికత ఉందా లేదా అంటే మనిషి బట్ట కట్టుకున్నాడా లేడా అని చూస్తారు. అలాంటి బట్టను నేసే చేనేత కార్మికులు దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. తెలంగాణలోనే కాదు భారత దేశంలో మొత్తంలో వారి పరిస్థితి దయనీయంగా ఉంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు వారికి పెన్షన్, నూలుకు సబ్బిడీ ఇచ్చారు. 

కానీ కాంగ్రెస్ వచ్చాక సబ్సిడీ ఆపేశారు. వారికి పెన్షన్ తప్ప ఆధారం లేదు. చేనేత కుటుంబంలో ఒకరికి చేనేత పెన్షన్ వచ్చినా సరే నార్మల్ పెన్షన్ కూడా ఇవ్వాలి. చీర నేసినప్పటికీ సొంతంగా వ్యాపారం చేసుకునే పరిస్థితి లేదు. దీంతో చాలా మంది నేత కార్మికులు కూలీకి వెళ్తున్నారు. ప్రభుత్వం వారిని ఆదుకోవాలి. పెండింగ్ సబ్సిడీలు తొందరగా రిలీజ్ చేయాలి. వారికి ప్రోత్సాహం అందిస్తూ, లోన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. 

కొత్త జనరేషన్ ఈ కళను ముందుకు తీసుకెళ్లాలంటే ప్రభుత్వం అండ ఉండాలి. లేదంటే చేనేత కళ అంతరించే ప్రమాదం ఉంది. సరైన గిట్టుబాటు లేక తమ పిల్లలను ఈ వృత్తి లో కొనసాగించేందుకు తల్లితండ్రులు ఇష్టపడటం లేదు. ప్రభుత్వాలు ఆదుకుంటే ఇంటర్ నెట్, సోషల్ మీడియా ద్వారా కూడా వ్యాపారం చేసుకోగలుగుతారు. 

బీసీల్లో అందరి కన్నా కూడా పద్మశాలి జనాభా ఎక్కువగా ఉంటుందంటారు. కానీ వారికి ఏ రాజకీయ పార్టీ కూడా ప్రాధాన్యం ఇవ్వటం లేదు. ఏ ప్రధాన పార్టీ కూడా వారికి ప్రాధాన్యం ఉన్న పదవులు ఇవ్వలేదు. పద్మశాలీలకు అన్ని పార్టీలు ప్రాధాన్యం ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా. అదే విధంగా బీసీలకు పార్టీల పరంగా కాకుండా రాజ్యాంగ పరంగా రిజర్వేషన్లు ఇవ్వాలి. అప్పుడు మాత్రమే ఆయా కులాల వారు వారి సమస్యలను ప్రభుత్వానికి చెప్పే అవకాశం ఉంటుంది. కొత్త కోట చేనేత కళాకారుల కష్టం చూశాను. బట్ట తయారీలో చాలా కష్టపడుతున్నారు. వారిని ఆదుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉంది. జాగృతి తరఫున కూడా సహకారం అందిస్తాం”. అని అన్నారు. 

కానాయిపల్లి శంకర సముద్రం రిజర్వాయర్ సందర్శన

కొత్తకోట – కానాయిపల్లి శంకర సముద్రం రిజర్వాయర్ సందర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు. నిర్వాసిత మహిళలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. 

కవిత గారి కామెంట్స్

“కానాయపల్లి శంకర మహాసముద్రం రిజర్వాయర్ ను 12 ఏళ్లైనా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇక్కడి నిర్వాసితులకు వాళ్ల ప్లాట్ల దగ్గరే ఇళ్లు కట్టించాలి. గతంలో 30, 40 మంది పేర్లు మిస్యయ్యాయి. వాళ్ల పేర్లను యాడ్ చేయాలి. అదే విధంగా ఇప్పుడు కొంతమంది ఊర్ల లేకుండా ఉన్నారు. వారికి కూడా న్యాయం చేయాలి. ఇక అప్పుడు 18 ఏళ్లు నిండని వాళ్లకు ఇప్పుడు 18 ఏళ్లు నిండాయి. వాళ్లందరికీ కూడా న్యాయం చేయాలి. మల్లన్న సాగర్, మిడ్ మానేరు, రంగనాయక సాగర్ నిర్వాసితులకు ఎలా న్యాయం చేశారో అలాగే చేయాలి. వాళ్లకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టి ఇవ్వాలి. అడిగితే గానీ అమ్మ కూడా అన్నం పెట్టదు. మనం కూడా అడిగితినే వాళ్లు మనకు న్యాయం చేస్తారు.

ఎందరో మగ నాయకులు వచ్చి మీకు న్యాయం చేస్తామని మోసం చేశారు. కానీ నేను మహిళా నాయకురాలిని…మీకు కచ్చితంగా న్యాయం చేస్తానని హామీ ఇస్తున్నాను. అయితే నేను చేసే పోరాటం లో మీరంతా కలిసి రావాలి. 

ఇప్పుడు నేను అధికారపార్టీలో లేను. అయినా సరే కొట్లాడి మీకు న్యాయం చేస్తా”. అని భరోసా ఇచ్చారు.

మతాశిశు సంరక్షణ కేంద్రం పరిశీలన

వనపర్తిలో భగీరథ విగ్రహానికి పూల మాల వేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించి.. మహిళలు, పిల్లలకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు. 

కవిత గారి కామెంట్స్

“మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఇక్కడ చాలా చక్కగా నిర్మించారు. కానీ సిబ్బంది కొరత ఉంది. సిబ్బందిని పెంచటంపై ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలి. ఈ హాస్పిటల్ టౌన్ కు దూరంగా ఉంది. అందువల్ల టెస్ట్ ల కోసం ఇబ్బంది పడాల్సి వస్తుంది. రేడియాలజీ డిపార్ట్ మెంట్ లో పర్మినెంట్ స్టాఫ్ లేదు. టెస్ట్ లకు ప్రజలు ఇబ్బంది పడవద్దంటే రేడియాలజీ డిపార్ట్ మెంట్ పై ఫోకస్ పెట్టాలి. హాస్పిటల్ లో గైనకాలజీ డాక్టర్ల సంఖ్య తక్కువగా ఉంది. వాళ్లు చాలా కష్టపడుతున్నప్పటికీ అందరికీ సేవలు అందించలేని పరిస్థితి. గైనకాలజీ డాక్టర్ల సంఖ్య పెంచటం పై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అదే విధంగా అన్ని హాస్పిటల్స్ ఉన్నట్లుగానే ఇక్కడ సమస్యలు ఉన్నాయి. శానిటేషన్, కేర్ టేకర్స్, సెక్యురిటీ సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు ఇవ్వటం లేదు. మెయింటెన్స్ కు డబ్బులు ఇవ్వటం లేదు. మందులు లేని పరిస్థితి ఉంది. ఈ సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నా. వనపర్తి లో రెండు రోజుల పాటు పర్యటిస్తాం. మండల స్థాయిలో ఉన్న సమస్యలను కూడా తెలుసుకుంటాం. ఆరోగ్య తెలంగాణ కావాలంటే ఆరోగ్య తెలంగాణ ఉండాలి. హాస్పిటల్స్ లో అన్ని సౌకర్యాలు ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయి.” అని అన్నారు. 

పెబ్బేరు లో కవిత గారి ఘన స్వాగతం 

జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా పెబ్బేరు మార్కెట్ యార్డును సందర్శించి.. రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు.

పెబ్బేరు పాతపల్లిలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు . ఈ సందర్భంగా స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.

అనంతరం పాటపల్లిలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను పరిశీలించి స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 

కవిత గారి కామెంట్స్

“తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మన జీవితాల్లో పెద్దగా మార్పు రాలేదు. రాష్ట్రం రాకముందు ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా పేదల పరిస్థితి అలాగే ఉంది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కొన్ని పనులు చేసుకున్నాం. కానీ ఇంకా చాలా చేయాల్సి ఉంది. పాతపల్లి లో 50 ఇళ్లను సగం వరకే కట్టి ఆపేశారు. నాలుగేళ్లుగా వాటిని అలాగే ఉంచారు. 

ఈ ఇళ్లను పూర్తి చేయాలని ప్రజలు కోరితే రూ. 80 వేలు అడుగుతున్నారంట. ఎవరి కోసం, ఎవరి ధైర్యంతో ఈ డబ్బులను వసూలు చేశారో మనం ఆలోచించాలి. పేద వాళ్లకు విద్య, వైద్యం, ఇళ్లు, వసతులు ఇవ్వకపోయినా ఏమీ కాదని వాళ్లను ఇంకా ఒత్తేస్తారు. మనం ఏమీ అడగకపోతే వాళ్లు అసలే పట్టించుకోరు. తెలంగాణ కావాలని గట్టిగా అడిగితేనే మనకు తెలంగాణ వచ్చింది. వచ్చాక పేదల జీవితాల్లో మార్పు రావాల్సిన అవసరముంది. సమాజంలో ముందుగా పేద వాళ్లకు అన్ని పథకాలు అందాలి. ఎవరో ఒకరు గట్టిగా అడాగాల్సిందే. అలా అడిగినప్పుడే ప్రభుత్వానికి భయం పుడుతుంది. ఇక్కడ 50 ఇళ్లు పూర్తయ్యే వరకు వాళ్ల కోసం జాగృతి తరఫున మేము కొట్లాడుతాం. 

ఇళ్లు రాని వాళ్ల కోసం కూడా మేము మీ తరఫున పోరాటం చేస్తాం.పెన్షన్లు, మహిళలకు రూ. 2500, తులం బంగారం ఇలా చెప్పినవి ఏమీ ఇవ్వటం లేదు. ప్రభుత్వాన్ని అడగాల్సిన ప్రతిపక్షం వాళ్లు ఆ బాధ్యత నుంచి తప్పించుకున్నారు. అందుకే ఆ బాధ్యతను ఒక ఆడబిడ్డగా నేను తీసుకున్నా”. అని అన్నారు