కేంద్రంలో ఉన్న కర్కశ ప్రభుత్వం మావోయిస్టులను లొంగదీసుకుంటున్న తీరు బాధాకరంగా ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. సూర్యపేటలో ఆదివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితుల్లో అడవుల్లో తుపాకీ ద్వారా పోరాటం కష్టమని, రాజకీయ ప్రక్రియలో మావోయిస్టులు భాగం కావాలని ఆమె పిలుపునిచ్చారు. రాజకీయంగా మాలాంటి వాళ్లకు దారి చూపాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి తెలంగాణ పట్ల కూడా చిత్తశుద్ధితో లేదన్నారు. నీటి కేటాయింపుల్లో నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. పోరాటం చేయాల్సిన స్థానిక బీజేపీ నాయకులు పట్టించుకోవటం లేదన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలోనూ బీజేపీ అలాగే చేసిందని దుయ్యబట్టారు. సమస్య తీర్చే స్థాయిలో ఉండి మనతో పాటు ధర్నా చేయటం ఏంటన్నారు. బీసీ రిజర్వేషన్లు ఇవ్వాల్సిన వాళ్లు ఇవ్వాలని.. మనలాంటి వాళ్లు అడగాలన్నారు.
