జనం బాటలో కవితకు నిజామాబాద్ జనం బాసట రెండో రోజు

అక్టోబర్ 25, 26 తేదీల్లో నిజామాబాదు జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటన వివరాలు

తెలంగాణ జాగృతి జనంబాట యాత్ర మొదలైన 2025 అక్టోబర్ 25 రోజున తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు బంజారాహిల్స్ లోని తన నివాసంలో ప్రత్యేక పూజాలు నిర్వహించి గన్ పార్క్ లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్దకు ఉదయం 10 గంటలకు బయలు దేరారు.

అనంతరం అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి…మీడియాతో మాట్లాడారు కవిత గారు.

కవిత కామెంట్స్

“తెలంగాణ అమరవీరులకు, వారి కుటుంబాలకు చేతులెత్తి క్షమాపణ కోరుతున్నా. ఏ ఆశయాల కోసం వారు ప్రాణత్యాగం చేశారో ఆ ఆశయాలు నెరవేరలేదు. 1200 మంది అమరులైతే 580 మందికి మాత్రమే పరిహారం ఇచ్చారు. ప్రతి అమరవీరుల కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా.
అమరుల కుటుంబాలకు, తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని ప్రమాణం చేస్తున్నా .

ఆ తర్వాత గన్ పార్క్ నుంచి నిజామాబాద్ కు పయనం

ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద తెలంగాణ జాగృతి నాయకులు కవిత గారికి ఘన స్వాగతం పలికారు.
నిజామాబాద్ జిల్లాకు చేరుకున్నాక దేవితండాలోని జగదాంబ మాత, సేవాలాల్ మహారాజ్ దేవాలయంలో కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు

నిజామాబాద్.. తెలంగాణ జాగృతి కార్యాలయంలో జాగృతి జనంబాట ప్రారంభ కార్యక్రమంలో కవిత గారు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు

నాపై కుట్ర జరిగింది

నిజామాబాద్ లో నా ఓటమి ఓ కుట్రనా కాదా?
నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆలోచించాలి.
20 ఏళ్లుగా కేసీఆర్, టీఆర్ఎస్, బీఆర్ఎస్ కోసం పనిచేశా.
ఇంటి గుట్టు బయట పెట్టి… కుట్ర చేసి నన్ను బయటకి పంపించారు. ఇప్పుడు నా దారి నేను వెతుక్కుంటున్నా.
ఈ జిల్లా బిడ్డగా, కోడలిగా మీ ఆశీర్వాదం కోసం వచ్చా.

సాయంత్రం నిజామాబాద్ జిల్లాలో గోదావరి ముంపు బాధితులతో కల్వకుంట్ల కవిత సమావేశమయ్యారు.

నవీపేట మండలం యంచ గ్రామస్థులను పంట నష్టంపై వివరాలు అడిగి తెలుసుకున్నరు. ప్రభుత్వం చేసిన పాపం కారణంగానే రైతులకు నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు రూ. 50 వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు యూరియా సప్లయ్ చేయటం రాని ప్రభుత్వానికి నీళ్ల గురించి ఏం తెలుస్తుందని విమర్శించారు.

జనం బాటలో భాగంగా అక్టోబర్ 26 న నిజామాబాద్ లో కవిత గారి రెండో రోజు పర్యటన వివరాలు

నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం బైరాపూర్ గ్రామంలో పోడు రైతులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు పరామర్శించారు.

ఫారెస్ట్ అధికారులు పంట ధ్వంసం చేయడంతో ఆత్మహత్యయత్నం చేసిన రైతు రామావత్ ప్రకాశ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు పట్టాలు ఇచ్చే వరకు వారి తరఫున పోరాడుతామన్నారు. ఆత్మహత్యల ఆలోచనలు వద్దంటూ రైతులకు ధైర్యం చెప్పారు.

అనంతరం నిజామాబాద్ లో మేధావులు, విద్యావేత్తలు, వివిధ రాంగాల ప్రముఖులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమాలోచనలు

నిజామాబాద్ లోని ఒక హోటల్ లో జిల్లాకు చెందిన ప్రముఖులతో కవిత గారు సమావేశమయ్యారు. తెలంగాణ లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు.. తన 20 ఏళ్ల ఉద్యమ, రాజకీయ ప్రస్థానం.. తాను రాజకీయంగా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లు.. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏ దిశగా సాగాలని మేధావులు కోరుకుంటున్నారు అనే అంశాలపై చర్చించారు.

అనంతరం ప్రెస్ మీట్ లో కవిత గారు మాట్లాడారు

అవకాశం, అధికారం, ఆత్మగౌరవం మా విధానం. సామాజిక తెలంగాణ సాధన ద్వారానే ఇది సాధ్యం. తెచ్చుకున్న తెలంగాణలో అందరికీ మంచి జరగాలనే జనం బాట. ప్రజల సమస్యలు తీరటం ముఖ్యం. రాజకీయ పార్టీ అవసరమైతే పెడతాం. నిజామాబాద్ లో నన్ను ఎమ్మెల్యేలే ఓడించారు. నన్ను బయటికి పంపి పార్టీ పెట్టించే అవసరం కేసీఆర్ గారికి లేదు. అలాంటిది ఉంటే మీడియా ముందు ఆయనే చెబుతారు. ఏ విషయమైనా సూటిగా చెప్పడమే నాకైనా కేసీఆర్ కైనా అలవాటు. కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ ను ఇష్యూ బేస్డ్ గానే విమర్శిస్తాను. కాంగ్రెస్ ది మునిగిపోయే నావ. వారు నాకు మద్దతు ఇవ్వటమేంటీ?

అనంతరం నిజామాబాద్ లో చిందు కళాకారులతో సమావేశం అయిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు. వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు

నిజామాబాద్ లో రౌడీషీటర్ రియాజ్ దాడిలో గాయపడి మృతి చెందిన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబ సభ్యులను ఆదివారం నిజామాబాద్ లోని బ్యాంక్ కాలనీలో పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రమోద్ ఫొటో వద్ద నివాళులర్పించారు. రౌడీషీటర్ రియాజ్ ను పట్టుకునే క్రమంలో కత్తిపోట్లకు గురై గాయపడిన ఆసిఫ్ ను నెహ్రు నగర్ లోని నివాసం లో పరామర్శించారు. రియాజ్ ను పట్టుకునే క్రమంలో జరిగిన ఘర్షణ, అసిఫ్ కు తగిలిన గాయాల గురించి ఆరా తీశారు. రౌడీషీటర్ ను పట్టుకునేందుకు అసిఫ్ ప్రదర్శించిన ధైర్యసాహసాలను అభినందించారు.