నివాస ప్రాంతాన్ని డంపుయార్డు చేశారు – అధికారులు పర్యటించి పరిష్కరించాలన్న కవిత | సనత్ నగర్ బీకే గూడ దాచారం వాసుల గోడు

జాగృతి జనంబాటలో భాగంగా బుధవారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.

జాగృతి జనంబాటలో భాగంగా బీకే గూడ దాచారం పర్యటన

సనత్ నగర్ నియోజకవర్గంలోని బీకే గూడ దాచారం ప్రాంతంలో  పర్యటించారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇండ్ల మధ్య చెత్త వ్యాన్లు నిలిపి ఉంచడం వల్ల దుర్గంధంతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు కవితకు గోడు వెల్లబోసుకున్నారు. వారితో కలిసి ఆ ప్రాంతాన్ని కవిత పరిశీలించారు. దాదాపు పదేండ్లుగా ఈ సమస్య అలాగే ఉందని, బీకేగూడ అంటే ఎవరూ గుర్తు పట్టడం లేదని డంపింగ్ యార్డు అనే పేరు పడిపోయిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఈ ప్రాంతం మారిందని తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని కవిత హామీ ఇచ్చారు. 

“దాచారం బస్తీలో నాలుగు ఎకరాల్లో చెత్త వెహికల్స్ ను నిలుపుతున్నారు. దీంతో చుట్టు ఉన్న ఇళ్లలో ప్రతి ఇంటికి ఇబ్బంది అవుతోంది. దీనికి సంబంధించి 12 ఏళ్లుగా ఎవరికీ చెప్పినా సమస్య తీరటం లేదని ప్రజలు చెబుతున్నారు. జనావాసాల్లో ఇలా చెత్త వెహికల్స్ కు ఎలా పర్మిషన్ ఇచ్చారు? జీహెచ్ఎంసీ పర్మిషన్ తోనే ఇక్కడ చెత్త వెహికల్స్ ను ఉంచుతున్నారా అన్నది ఎవరికీ క్లారిటీ లేదు. మొత్తం చెత్త డంపింగ్ యార్డ్ మాదిరిగా దీన్ని తయారు చేశారు. దీంతో ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. గంజాయి తాగుతున్నారు. మొన్న దసరా పండుగ అప్పుడు ఒక మర్డర్ కూడా జరిగింది. మహిళలు, చిన్న పిల్లలు కూడా ఇక్కడ నుంచి వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఉంది. వెంటనే ఇక్కడ చెత్త తీసుకొచ్చే ఆటోలు, డంప్ యార్డ్ ను తీసేయాలి. ఈ విషయంలో ప్రజల పక్షాన జాగృతి పోరాటం చేస్తుంది. ఇంత భయంకరమైన పరిస్థితులు ఉన్న ఈ ప్రాంతాన్ని అధికారులు వచ్చి చూడాలి. జనం బాటలో భాగంగా ప్రతి జిల్లా తిరుగుతున్నాం. ప్రతి జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం.”

దర్గా సందర్శన

జనంబాటలో పర్యటించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సనత్ నగర్ లోని దర్గా హజ్రత్ సయ్యద్ ఇబ్రహీం షా దర్గాలో చాదర్ సమర్పించారు.  ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.