సూర్యాపేట Archives - Telangana Jagruthi

రాజేశ్ మృతిపై విచారణ జరపాలి -కల్వకుంట్ల కవిత
కోదాడలో పోలీస్ కస్టడీలో మృతి చెందిన దళిత యువకుడు కార్ల రాజేశ్ కుటుంబ సభ్యులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదివారం పరామర్శించారు.  లక్ష రూపాయల వివాదంలో తెలంగాణ ప్రభుత్వం నిండు ప్రాణాన్ని బలి తీసుకుందని కవిత విమర్శించారు. రాజేశ్ చనిపోయిన తర్వాత కూడా విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు. స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసులో రిమాండ్ చేసి నాలుగు రోజులు పలు స్టేషన్లలో తిప్పారని చెప్పారు. రిమాండ్ కూడా చూపించకుండా రాజేష్ పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌరుషంతో లక్ష రూపాయలు  వాళ్ల మొఖాన కొట్టినా జాలి లేకుండా ఆ అబ్బాయి ఆరోగ్యం పాడయ్యేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు హాస్పిటళ్లలో చూపించామని చెబుతున్నారు కానీ జైలు అధికారులు కాకుండా రెగ్యులర్ పోలీసులు ఎందుకు ఇందులో ఇన్ వాల్వ్ అయ్యారో వెల్లడించాలని ప్రశ్నించారు. ప్రభుత్వం, పోలీసులు రాజేష్ ను పొట్టన బెట్టుకున్నారని ఆరోపించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు విశారదన్ వచ్చినప్పుడు అనేక మంది జాగృతి నాయకులు ఆయన వెంట ఉన్నారని గుర్తు చేశారు. మందకృష్ణ మాదిగ వచ్చి గట్టిగా మాట్లాడిన తర్వాతనే ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక వచ్చిందని తెలిపారు. రాజేశ్ కాస్టోడియల్ డెత్ విషయంలో అగ్రవర్ణానికి చెందిన ఎస్సైని కాపాడి బీసీ బిడ్డ అయిన సీఐని బదిలీ చేశారని కవిత విమర్శించారు. పోస్ట్ మార్టం సహా అనేక అంశాలపై అనుమానాలు ఉన్నాయన్నారు. ఇంత అన్యాయం జరిగితే సరిదిద్దుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయకపోవడం విచారకరమన్నారు. స్థానిక ఎమ్మెల్యే పద్మావతమ్మ ఏ గుడికి వెళ్లినా సరే నియోజకవర్గ ప్రజల పేరు మీదనే అర్ఛన చేయిస్తా అని చెబుతుంటారు. మరి కర్ల రాజేష్ మీ బిడ్డ లాంటి వ్యక్తి కాదా అని నేను ప్రశ్నించారు. అతని మరణం మిమ్మల్ని కలిచి వేయటం లేదా అని నిలదీశారు. మీ నియోజకవర్గంలో ఇంత పెద్ద ఘటన జరిగితే మీరు కనీసం మాట్లాడకపోవటం ఏంటని ఎమ్మెల్యే పద్మావతిని ధ్వజమెత్తారు.

పట్టించుకోని తెలంగాణ డజీపీ

ఇలాంటి అనేక అట్రాసిటీస్ విషయాల్లో డీజీపీని కలుస్తామంటే కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వటం లేదని కవిత చెప్పారు. సూర్యాపేట జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా స్పందించాలని డిమాండ్ చేశారు.

నిండు ప్రాణం పోయినా సరే నాకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించటం సరికాదన్నారు. 2025 లో కూడా దళితులను చావకొట్టి నోరు మూస్తామంటే కుదిరే పనికాదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కర్ల రాజేష్ విషయంలో ఏం జరిగిందో తెలియాలన్నారు. దీని మీద ఎంక్వైరీ వేయాలి. ఎస్సైని కచ్చితంగా సస్పెండ్ చేయాలని కవిత డిమాండ్ చేశారు. అదే విధంగా జైలు అధికారులకు ఏం శిక్ష పడిందో తెలియాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే పద్మావతమ్మ కర్ల రాజేష్ కుటుంబాన్ని వెంటనే పరామర్శించాలని కోరారు.

The post రాజేశ్ మృతిపై విచారణ జరపాలి -కల్వకుంట్ల కవిత appeared first on Telangana Jagruthi.

రాజకీయ పోరాటమే మంచిది -కల్వకుంట్ల కవిత
లొంగిపోయి రాజకీయంగా స్ఫూర్తినివ్వాలని మావోయిస్టులకు పిలుపు | సూర్యాపేట

కేంద్రంలో ఉన్న కర్కశ ప్రభుత్వం మావోయిస్టులను లొంగదీసుకుంటున్న తీరు బాధాకరంగా ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. సూర్యపేటలో ఆదివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితుల్లో అడవుల్లో తుపాకీ ద్వారా పోరాటం కష్టమని, రాజకీయ ప్రక్రియలో మావోయిస్టులు భాగం కావాలని ఆమె పిలుపునిచ్చారు. రాజకీయంగా మాలాంటి వాళ్లకు దారి చూపాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి తెలంగాణ పట్ల కూడా చిత్తశుద్ధితో లేదన్నారు. నీటి కేటాయింపుల్లో నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. పోరాటం చేయాల్సిన స్థానిక బీజేపీ నాయకులు పట్టించుకోవటం లేదన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలోనూ బీజేపీ అలాగే చేసిందని దుయ్యబట్టారు. సమస్య తీర్చే స్థాయిలో ఉండి మనతో పాటు ధర్నా చేయటం ఏంటన్నారు. బీసీ రిజర్వేషన్లు ఇవ్వాల్సిన వాళ్లు ఇవ్వాలని.. మనలాంటి వాళ్లు అడగాలన్నారు.

Kalvakuntla Kavitha addressing the media in Suryapet during Janambata on Krishna river water disputes

The post రాజకీయ పోరాటమే మంచిది -కల్వకుంట్ల కవిత appeared first on Telangana Jagruthi.

జగదీశ్ రెడ్డి దౌర్జన్యాలకు జనం బలి -కల్వకుంట్ల కవిత
జగదీష్ రెడ్డి అనుచరులకు దేవుళ్లు, చెరువులు అన్న కూడా లెక్కలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. కర్నాల చెరువును కూడా ఆక్రమించారని విమర్శించారు. సూర్యాపేటలో ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ అలుగు పోయే దాని మీద రోడ్డు వేశారని, దీనిపై నేను గూగుల్ ఫొటోలతో హైడ్రాకు ఫిర్యాదు చేస్తాని తెలిపారు.దీనిపై చర్యలు తీసుకుంటారో లేదో అన్న దాన్ని బట్టి ఉత్తమ్, జగదీశ్ రెడ్డిల అండర్ స్టాండింగ్ తెలుస్తుందన్నారు. సూర్యాపేట జిల్లాలో జాగృతి జనంబాటలో భాగంగా రెండురోజుల పర్యటన సందర్భంగా పలు ప్రాంతాలను సందర్శించిన కవిత జగదీశ్వర్ రెడ్డి అక్రమాలపై ధ్వజమెత్తారు.

“విజయవాడ-సూర్యాపేట హై వే వెంచర్ లో భారీ అక్రమాలు జరిగాయి. వాటిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తా. జీవో 58, 59ని అడ్డుపెట్టుకొని సూర్యాపేటలో  5 ఎకరాల భూమిని రైగ్యులరైజ్ చేసుకున్నారు. గుర్రంపోడు భూముల విషయంలో స్కామ్ జరిగినట్లు గతంలో పెద్ద వివాదం నడిచింది. కానీ ఈ ప్రభుత్వం కూడా దానిపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదో చెప్పాలి. జగదీష్ రెడ్డి మంత్రిగా ఉన్నా సూర్యాపేట పరిస్థితి మారలేదు. కనీసం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా ప్రజలకు మంచి చేసేందుకు ప్రయత్నించాలి. టౌన్ లో పూల్లారెడ్డి చెరువును ట్యాంక్ బండ్ చేస్తామని మాట నిలుపుకోలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికలు అనగానే హడావుడిగా సీసీ రోడ్డు వేశారు.

ఇప్పుడు ప్రభుత్వం మారాక అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం వాటిని తవ్వతున్నారు. అంటే ఎవరికీ లాభం లేకుండా ప్రజాధనం దుర్వినియోగం చేయటం చూస్తుంటే బాధనిపిస్తోంది. వాగుల్లో కట్టిన చెక్ డ్యాములు ఏడాదికే కొట్టుకుపోయాయి. టౌన్ లో ఆత్మగౌరవ కుల భవనాలు ఇవ్వలేదు. సూర్యాపేటలో 900 పైగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టారు. వాటిలో 800 మందికి సున్నం కూడా వేయకుండా ఇచ్చేశారు. చీదేళ్లలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కూడా ఎలాంటి వసతులు లేకుండా ఇచ్చేశారు. సూర్యాపేట మెడికల్ కాలేజీలో 300 మంది ఫ్రొఫెసర్లకు గాను 150 మంది మాత్రమే ఉన్నారు. ఇక చీదేళ్ల గ్రామాన్ని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి దత్తత తీసుకున్నారంట. అక్కడి 6 కిలోమీటర్ల రోడ్డుపై ప్రయాణించాలంటే 60 కిలోమీటర్లు ప్రయాణించినంత సమయం పడుతోంది. రోడ్డు పూర్తిగా ఆధ్వాన్నంగా గుంతలతో నిండి ఉంది. వెంటనే రోడ్డు వేయాలని డిమాండ్ చేస్తున్నా. హుజుర్ నగర్ లో కూడా 14 ఏళ్ల కింద ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో కట్టిన  2 వేల ఇళ్లు ఎవరికీ ఇవ్వలేదు. ఇప్పటికైనా  వాటిని అర్హులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. కృష్ణానది మఠంపల్లి వద్ద ఓ ఫార్మా కంపెనీ వాడు మొత్తం వెస్టేజ్ పడేశాడు. దీంతో వంద గ్రామాలకు నీళ్లు ఇవ్వలేదు. కానీ ఆ వేస్టేజ్ పడేసిన ఫార్మా కంపెనీని గుర్తించలేదు. నిఘా వ్యవస్థ, పోలీసులు ఏం చేస్తున్నారో మంత్రిగారు చెప్పాలి.”

మహనీయుల గడ్డ ఇది

“ఫణిగిరి మ్యూజియంలో కళాఖండాలు ఇప్పటికీ మా జాగృతి ఆఫీసులో ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలోనే జూరాస్ పల్లి గుట్ట మీద దేవస్థానం కోసం కొట్లాడినం. గొల్లగట్టు జాతర ఘనంగా జరిపించాలని కూడా మేము ఫైట్ చేశాం.

బీఎన్ రెడ్డి, మల్లు స్వరాజ్యం, మారోజు వీరన్న లాంటి మహనీయులు పుట్టిన ఈ గడ్డకు సలాం. బీఎన్ రెడ్డి పేరును ఏదైనా ప్రాజెక్టుకు పెట్టాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. మల్లు స్వరాజ్యం కాంస్య విగ్రహాన్ని ప్రభుత్వం ఖర్చుతో సుర్యాపేటలో ఏర్పాటు చేయాలి.

ఉప్పల మధుసూదన్ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎంతో నిజాయితీ పరులు. ఎమ్మెల్యే అయినా కూడా ఆయన చెప్పులు కుట్టారు. ఏదైనా మంచి కార్యక్రమానికి ఆయన పేరు పెట్టాలి. బండి యాదగిరి రాసిన పాట స్ఫూర్తితో నిజాం పైన పోరాటం చేశాం. అదే స్ఫూర్తితో నేను కూడా గుంటనక్క మీద యుద్ధం చేస్తున్నా. సామాజిక తెలంగాణను ప్రతిపాదించిన వ్యక్తి మారోజు వీరన్న. ఆయన స్ఫూర్తితోనే మేము కూడా ఉద్యమం చేస్తున్నాం. సూర్యాపేట జిల్లా అర్వపల్లి కేజీబీవీలో దోమలు, కోతుల బెడదతో తీవ్ర సమస్యలు ఉన్నాయి. ఆడపిల్లలే కాదా అని చులకనగా చూస్తే చరిత్ర మార్చేస్తారని హెచ్చరిస్తున్నా.

వెంటనే ఈ స్కూల్ లో సౌకర్యాలు ఏర్పాటు చేయాలి.

ఎస్సారెస్పీ కాల్వ దగ్గర చూసిన కాల్వలు మెయింటెనెన్స్ లేకుండా ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో అన్ లైన్డ్ కెనాల్స్ తో మనకు అన్యాయం చేశారు. తెలంగాణ వచ్చాక మనం సరిచేసుకుంది ఏమీ లేదు. కనీసం మెయింటెనెన్స్ కు రూపాయి కూడా ఇవ్వలేదు. ఆపరేషన్స్ అండే మెయింటెనెన్స్ విభాగానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు పైసా నిధులు ఇవ్వలేదు. రుద్రమ చెరువును వెంటనే 5 టీఎంసీల రిజర్వాయర్ గా మార్చాలి. తుంగతుర్తి లో 100 పడకల హాస్పిటల్ పూర్తి కాలేదు. ఉన్న 30 పడకల హాస్పిటల్ ను కూల్చేసి 12 బెడ్స్ చేశారు.  కానీ పనులు పూర్తి కాలేదు. బిల్లులు రాకపోవటంతో పనులు చేయలేదని కాంట్రాక్టర్ చెబుతున్నాడు. ఆయనకు జిల్లాలో మూడు హాస్పిటల్స్ నిర్మాణం టెండర్ వస్తే ఒకటి తర్వాత ఒకటి కడతామంటున్నారు. అగ్రిమెంటులో ఉన్న సమయం దాటిపోయింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఈ అంశాన్ని కలెక్టర్ పరిశీలించాలి. గుండ్ల సింగారంలో బ్రిడ్జి పరిస్థితి దారుణంగా ఉంది. దాని స్థానంలో కొత్తది నిర్మించాలి. తుంగతుర్తి, సుర్యాపేటలో 20 రోజులుగా మిషన్ భగీరథ మంచి నీళ్లు వస్తలేవు. త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరించాలి. గత ప్రభుత్వంలోనే ఇసుక బుక్కారు. ఇప్పుడు ఉన్న వాళ్లు కూడా ఇసుక బుక్కుతున్నారు. కానీ దాని కారణంగా బ్రిడ్జిలు కూలే పరిస్థితి వస్తుంది. ఇసుక విషయంలో ఏ ప్రభుత్వం వచ్చినా సరే మ్యాచ్ ఫిక్సింగ్ తో దోపిడీ చేస్తున్నారు. తుంగతుర్తిని మున్సిపాలిటీ చేయలేదు. ఎందుకు చేస్తలేరని ప్రజలు అడుగుతున్నారు. సూర్యాపేట్ లో ఇంటిగ్రేటేడ్ మార్కెట్ ను ఊరిలో కట్టాల్సి ఉండగా ఊరి బయట కట్టారు. టౌన్ లో రోడ్ వెడల్పు కోసం నోటీసులు ఇచ్చిన  మూడు రోజుల్లో 300 షాపులు కూల్చేశారు. 8 ఏళ్లుగా వారికి పరిహారం ఇవ్వలేదు. కేసు వేసిన వాళ్లను భయపెడుతున్నారు.

కలెక్టర్ ఇన్వాల్వ్ అయ్యి ఆ 3 వందల షాపుల వారికి పరిహారం ఇప్పించాలి. ఇంటిగ్రేటేడ్ వెజ్-నాజ్ వెజ్ మార్కెట్ 50 కోట్లతో కట్టారంటున్నారు. కానీ అక్కడ ఉన్న సమస్యలతో అది అందుబాటులోకి రాలేదు. “

అవినీతిపై ప్రశ్నిస్తూనే ఉంటా

“ఎస్సారెస్సీ స్టేజ్- 2 లో భాగంగా సూర్యాపేటలో ఒక్క రిజర్వాయర్ కూడా లేదు. రిజర్వాయర్లు కడితినే సూర్యాపేట, కోదాడ, తుంగతుర్తి ప్రజలకు మేలు జరుగుతుంది. అదే విధంగా కాల్వలకు కూడా లైనింగ్ వేయించాలి. 30 వేల ఎకరాలకు నీళ్లిచ్చే మూసీ గేట్ గతంలో ఊడిపోయింది. అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు రూ.280 కోట్లతో ప్రాజెక్ట్ కడతామని అన్నారు. కానీ ఇప్పటికీ అతిగతీ లేదు. హుజుర్ నగర్, కోదాడ నియోజకవర్గాల్లో 54 లిప్ట్ లు ఉంటే 17 లిఫ్టులు పాక్షిక్షంగా, 21 లిఫ్టులు పూర్తిగా పనిచేస్తలేవు. వీటన్నింటిని కాదని గతంలో బీఆర్ఎస్ 1450 కోట్లతో మెగా లిప్ట్ ప్రాజెక్టును ప్రతిపాదించింది. అప్పుడు దాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు రూ.500 కోట్లు పెంచి వేగంగా ఆ లిప్ట్ పనులను చేస్తున్నారు. మూడేళ్లలో ఏమీ మారిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ లిప్ట్ పనులను చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. లిఫ్టుల రిపేర్ కు డబ్బులు ఇస్తారా? అదే విధంగా మెగా లిప్ట్ లో మీ వాటా ఎంతో చెప్పాలి. ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి హౌసింగ్ మినిస్టర్ గా ఉన్నప్పుడే 13 వేల ఎకరాల సున్నపు గనులు పోయాయి. పులిచింతల ప్రాజెక్ట్ ద్వారా మనకు నష్టం జరిగితే కూడా ఆయన మాట్లాడలేదు. ఆంధ్రా ప్రభుత్వం 36 టీఎంసీల నీటిని ఆపితే మఠంపల్లి వద్ద లక్ష్మీ నరసింహా స్వామి ఆలయం మునిగిపోతుంది. మీకు స్వామి మీద భక్తి ఉంటే 30 టీఎంసీల కన్నా ఎక్కువ నీళ్లు స్టోర్ చేయకుండా ఆంధ్రా ప్రభుత్వాన్ని ఒప్పించాలి. నాగార్జున సాగర్ లెప్ట్ కెనాల్ మెయింటెన్స్ ను పట్టించుకోవటం లేదు. దీనిపై  ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టి పెట్టాలి. 1000 కోట్ల కస్టమ్ మిల్లింగ్ స్కామ్ నిందితులపై ఇప్పటికీ చర్యలు తీసుకుంటలేరు. ఊరి మధ్యలో కట్టాల్సిన కలెక్టరేట్ ను ఊరవతల ప్రైవేట్ వెంచర్ లో కట్టారు. పైగా అక్కడ 25 ఎకరాలను రూ. 25 లక్షలు ఇచ్చి కొన్నారు. తెలంగాణలో ఏ ప్రాజెక్టులో భూమి పోయిన రైతులకు కూడా ఎకరాకు ఇంత పరిహారం ఇవ్వలేదు. జగదీష్ అన్న చాలా స్పెషల్ కాబట్టి ఆయన ఎకరాకు రూ. 25 లక్షలు ఇప్పించుకున్నారు.

ఆ చుట్టుపక్కల 3 వందల ఎకరాలు వెంచర్లు వేసి అక్రమాలు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగదీష్ రెడ్డి ఫ్రెండ్స్ కనుక చర్యలు ఉండవు. కానీ తెలంగాణ ప్రజలకు ఈ విషయం తెలియాలని నేను చెబుతున్నా.  చివ్వెల మండలంలో ఆరు ఎకరాల భూమి దేవుడి భూములను కబ్జా చేశారు. ఎండో మెంట్ అధికారులు కచ్చితంగా దానిపై చర్యలు తీసుకోవాలి. టౌన్ లోని ఆటో నగర్ వాళ్లకు 50 ఎకరాలు ఇస్తామని చెప్పి 5 ఎకరాలు కూడా ఇవ్వలేదు.

జగదీష్ అన్న వాళ్ల అమ్మ బర్త్ డే సందర్భంగా కబడ్డీ పోటీలు పెట్టి దేశ వ్యాప్తంగా తెలంగాణ పరువు తీశారు.

పోటీల సందర్భంగా వీళ్లు అస్తవ్యస్థంగా చేసిన ఏర్పాట్లతో ఒకరు చనిపోయారు. 26 మందికి గాయాలయ్యాయి.

వారికి ఉచితంగా వైద్యం కూడా చేయించలేదు. దీంతో వాళ్లంతా తెలంగాణ గురించి చెడుగా మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా అవకాశం ఉంటే ఆ గాయపడిన వారికి చికిత్స అందించాలి. జగదీశ్ రెడ్డి, హరీశ్ రావు మీద నాకు వ్యక్తిగతంగా ఎలాంటి కోపం లేదు. వాళ్ల అవినీతి గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. అవినీతి లేకుండా ఉన్నప్పుడే అట్టడుగునున్న ప్రజలకు కూడా లాభం జరుగుతుంది. లేదంటే అవినీతితో అక్రమార్జన చేసి మళ్లీ ఎన్నికల్లో ఖర్చు చేస్తారు. పది వేల రూపాయలు ఓటుకు ఇచ్చి తండ్రిని సర్పంచ్ గా గెలిపించుకుంటారు. అవినీతి కారణంగా ప్రజలకు కావాల్సిన మేలు, ప్రయోజనాలు జరగవు. నేను మాట్లాడటం కారణంగా జగదీష్ రెడ్డి చుట్టు ఉన్న వాళ్లు నాపై ఏడుస్తారు. కానీ సూర్యాపేట్ జిల్లాలోని పది లక్షల మంది ప్రజల కోసం మాట్లాడుతున్నాను. ఇప్పటికైనా సరే మనం అవినీతి లేకుండా తెలంగాణను బాగు చేసుకోవాలి. వ్యవస్థలో లిమిటెడ్ గా ఉన్న అవినీతిని మనం ఆపలేము. కానీ ఇష్టానుసారంగా అవినీతి పాల్పడటం కరెక్ట్ కాదు. అడ్డగోలుగా అవినీతి చేసే వ్యక్తులపై నేను మాట్లాడుతూనే ఉంటా. యూరియా కోసం యాప్ మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. ముందు రైతులకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చి యాప్ పెట్టాలి. లేదంటే వాళ్లు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. పార్టీనే వద్దనుకున్న తర్వాత నైతికతతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాను. నేను జాగృతి ఏర్పాటుకు ముందు లక్షన్నర కిలోమీటర్లు తిరిగి అధ్యయనం చేశాను. ఇప్పుడు కూడా అదే విధంగా సమస్యలపై అధ్యయనం చేస్తున్నా. రాష్ట్రంలో ఒక్కో జిల్లాలో రెండు రోజులు ఉంటూ ప్రతి సమస్యపై మాట్లాడుతున్న నాయకులు ఎవరైనా ఉన్నారా?

బీఆర్ఎస్ లో జరిగిన అన్యాయంపై మాట్లాడుతూనే ఇప్పుడు ఎలా బాగు చేయాలని చూస్తున్నాం.”

The post జగదీశ్ రెడ్డి దౌర్జన్యాలకు జనం బలి -కల్వకుంట్ల కవిత appeared first on Telangana Jagruthi.

గుంటనక్క హరీష్ రావు కుట్రలతో రాష్ట్రానికి ద్రోహం -కల్వకుంట్ల కవిత
అసెంబ్లీ వదిలి ఆఫీసులో డ్రామాలు | సూర్యాపేట

గుంటనక్క హరీష్ రావు కారణంగానే తెలంగాణకు సాగునీటి జలాల విషయంలో అన్యాయం జరిగిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఆయనను ముఖ్యమంత్రి ఒక్క మాట అంటే సభను వాయిదా వేసుకొని వెళ్లిపోయారని తప్పుపట్టారు. ప్రతిపక్షం అంటే ఒక పార్టీ మాత్రమే కాదు.. ప్రజల గొంతుక అన్నారు. తన మాట నెగ్గడం కోసం సభ నుంచి పార్టీ మొత్తాన్ని వాకౌట్ చేయించారని హరీశ్ రావుపై ధ్వజమెత్తారు. జాగృతి జనంబాటలో భాగంగా సూర్య పేటలో కవిత మీడియా సమావేశంలో మాట్లాడారు.

బీఆర్ఎస్ డ్రామా

“సభలో కాంగ్రెస్ ది ఒక డ్రామా అయితే బీఆర్ఎస్ ది మరొక డ్రామా. సభలో మూసీ, జీహెచ్ఎంసీకి సంబంధించిన డివిజన్లపై చర్చ జరిగితే ప్రతిపక్షం లేదు. కేవలం హరీశ్ రావు ను అంటే బాయ్ కాట్ చేస్తారా? కేసీఆర్ ను తిట్టినప్పుడు ఈ గుంటనక్క అలాగే వ్యవహరించిందా? ఏదైనా అంశంపై వ్యతిరేకత ఉంటే ఆ అంశంపై మాత్రమే బాయ్ కాట్ చేయాలి. మేము పార్లమెంటులో ఉన్నప్పుడు కూడా అంశాలను బట్టి వ్యతిరేకత చెప్పే వాళ్లం. మళ్లీ వేరే అంశానికి సంబంధించి చర్చ జరిగినప్పుడు వచ్చి మాట్లాడే వాళ్లం. నిన్న జీహెచ్ఎంసీని 300 డివిజన్ చేసే బిల్లు పెట్టారు. అది అవసరం లేదా? దానిపై బీఆర్ఎస్ చర్చలో పాల్గొనవద్దా..హరీష్ రావు ను తిట్టారు కనుక వాయిదా వేసుకొని పోయారా? డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా బాయ్ కాట్ నిర్ణయాన్ని హరీశ్ రావు తీసుకున్నారా.. లేక బీఆర్ఎస్ అధినాయకత్వం తీసుకుందా? బీఆర్ఎస్ మిగతా డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు సబితా, శ్రీనివాస్ యాదవ్ కూడా తమ టైమ్ హరీశ్ రావుకే ఇవ్వమన్నారు. అంటే హరీశ్ రావు పార్టీలో తనకంటూ ఒక గుంపును తయారుచేసుకుంటున్నారా..

బాయ్ కాట్ నిర్ణయం కచ్చితంగా హరీశ్ రావు దే అని నేను బలంగా నమ్ముతున్నా. ఒకవేళ కేసీఆర్ గానీ కేటీఆర్ గానీ తీసుకొని ఉంటే అది శ్రేయస్కరమైన పద్ధతి కాదు. కృష్ణా జలాల అంశంపై సభలు పెడతామంటున్నారు. చట్టసభలో వచ్చిన అవకాశాన్ని వదులుకోవటం సరికాదు. ప్రజలు ఏమనుకున్నా సరే బీఆర్ఎస్ లో తోక కుక్కను ఊపే పరిస్థితి వచ్చింది. ప్రతిపక్షం లేకపోవటంతో కాంగ్రెస్ వాళ్లు ఇష్టమొచ్చినట్లు అబద్దాలు చెప్పారు. బీఆర్ఎస్ ఉండి ఉంటే ఆ అబద్ధాలను అడ్డుకునే అవకాశం ఉండేది కదా? “

రాష్ట్రానికి హరీశ్ అన్యాయం

“తెలంగాణ నీటివాటాను తగ్గించే విధంగా హరీశ్ రావు మంత్రిహోదాలో నిర్ణయం తీసుకుని రాష్ట్రానికి అన్యాయం చేశారు. తెలంగాణకు 3 శాతం నీటి వాటా తగ్గించే ఒప్పందానికి సంతకం చేసింది హరీశ్ రావ్ కాదా? ఇప్పటికే కట్టిన ప్రాజెక్టులపై తెలంగాణకు 37 శాతం, ఆంధ్రాకు 63 శాతం వాటా ఉండేది. కానీ కాళేశ్వరరావు అని పిలిపించుకున్న హరీశ్ రావు మనకు 34 శాతం నీళ్ల వాటాకే అంగీకరిస్తూ సంతకం చేశారు. ఇది నిజమా..కాదా? చెప్పాలి. విజ్ఞతకే వదిలేస్తున్నా అంటే ప్రజలు గమనిస్తారు. లేదంటే ప్రజలు తమ విజ్ఞతను ప్రదర్శిస్తారు. నేను అడిగిన ప్రశ్నలకు హరీశ్ రావు తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో సమాధానం చెప్పాలి. జూరాల నుంచి శ్రీశైలంకు ఇన్ టేక్ పాయింట్ ఎందుకు మార్చారో కూడా చెప్పాలి. హరీశ్ రావు ధనదాహాం కారణంగానే ఇన్ టేక్ పాయింట్ శ్రీశైలంకు మారింది. ఏల్లూర్ పంప్ హౌస్ ను అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ గా మార్చారు. అందుకు దాదాపు 14 వందల కోట్లు ఖర్చు పెట్టారు. దీని కారణంగా 30 మీటర్ల ఎత్తు పెరిగి మనం తీసుకోవాల్సిన వాటర్ కెపాసిటీ తగ్గింది. పైగా అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ కారణంగా కల్వకుర్తి లిప్ట్ ఇరిగేషన్ లో మోటార్లు చెడిపోయాయి. మొత్తం 5 మోటార్లకు గాను ఇప్పటి వరకు 3 మోటార్లే పనిచేస్తున్నాయి. వాటిని రిపేర్ కూడా చేయలేదు.

అసెంబ్లీలో చెప్పే అంశాలను పార్టీ ఆఫీసులో చెప్పటం సరికాదు. హరీశ్ రావు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అంటేనే ఆయనకు రేవంత్ తో మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు ఉంటాయి. కేసీఆర్ ను సీఎం కసబ్ తో పోల్చితే నేను మాత్రమే రియాక్ట్ అయ్యాను. కేసీఆర్ లేకుండా తెలంగాణ లేదు. అలాంటి వ్యక్తిని టెర్రరిస్ట్ తో పోల్చుతారా.. రాజకీయంగా హుందాగా విమర్శలు చేయాలని భావించే వ్యక్తిని నేను. కేసీఆర్ ను ఉరి తీయాలని రేవంత్ రెడ్డి అంటున్నాడు. మరి కృష్ణానది నీటిలో నష్టం చేస్తున్న దానికి ఆయనను రెండుసార్లు ఉరి తీయాలి. కేసీఆర్ అలా విమర్శించటం దేశద్రోహామే అవుతుంది. కేసీఆర్ అలా విమర్శిస్తే బీఆర్ఎస్ నుంచి ఎవరు మాట్లాడలేదు. ఎవరి ఎజెండాలు వాళ్లకు ఉన్నాయి. అందుకే వాళ్లు లోపలున్నరు..నేను బయట ఉన్నాను. బీఆర్ఎస్ హయాంలో నన్ను నిజామాబాద్ కే పరిమితం చేశారు. అయినా సరే ఆ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల్లో నాకు కూడా భాగం ఉన్నట్లే. నేను జనంబాట ప్రారంభించినప్పుడే క్షమాపణ చెప్పి ముందుకు కదిలాను. నాయకులు తప్పులు చేసినప్పుడు క్షమాపణ కోరి సరిదిద్దుకోవాలి. బీఆర్ఎస్ హయాంలో రైతులకు బేడీలు వేశారు. ఉద్యమకారులకు చేయాల్సినంత చేయలేదు. ఆ పాపంలో నాకు భాగస్వామ్యం ఉన్నట్లే. అందుకే క్షమాపణ చెప్పాను. భవిష్యత్తులో చాలా జరుగుతాయి. ఇక నేను సక్సెస్ అవుతానా.. ఫెయిల్ అవుతానా ప్రజలు నిర్ణయిస్తారు.”

The post గుంటనక్క హరీష్ రావు కుట్రలతో రాష్ట్రానికి ద్రోహం -కల్వకుంట్ల కవిత appeared first on Telangana Jagruthi.

ఆల్మట్టి ఎత్తు పెంపు, అప్పర్ భద్రకు జాతీయ హోదాను వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేయాలి
పాలమూరుకు రేవంత్ రెడ్డి చేస్తున్న అన్యాయాన్ని ప్రజలు క్షమించరు.

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో అసెంబ్లీలో ప్రభుత్వం అడ్డగోలు అబద్దాలు చెప్పిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కృష్ణా జలాల అంశంపై చర్చించాలని డిమాండ్ చేశారు. జాగృతి జనంబాటలో భాగంగా సూర్య పేట జిల్లాలో పర్యటిస్తున్న కవిత ఆదివారం సూర్యాపేటలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ సాగు జలాల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు అన్యాయం చేశాయని దుయ్యబట్టారు.

సమస్య పక్కదారి

“నిన్న అసెంబ్లీలో విచిత్ర పరిణామాలు జరిగాయి. అసలు సెషన్ లో మొత్తం ప్రతిపక్షమే లేకుండా సభ జరిగింది. దీంతో పాలకపక్షం అడ్డగోలుగా అబద్దాలు చెప్పింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇష్టానుసారం ప్రసంగం కొనసాగించారు. నిజానికి కృష్ణా జలాల మీద చర్చ అని చెప్పారు. అలాంటప్పుడు స్టేక్ హోల్డర్స్ అయిన మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఏపీ గురించి మాట్లాడాలి. కానీ అపెక్స్ కౌన్సిల్ లో మాట్లాడి వచ్చిన దాని మీద మాత్రమే చర్చ చేశారు. దాంతో ప్రజలకు ఏం లాభం? కృష్ణా వాటర్ రివర్ మేనేజ్ మెంట్ బోర్డులో రెండు రాష్ట్రాలను మాత్రమే ఉంచి మనకు అన్యాయం చేశారు. సభలో మాత్రం సీఎం నేను మాట్లాడేది వందేళ్లు చరిత్రలో ఉంటుందన్నారు. అసలు కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టిని డ్యాం ఎత్తును 5 మీటర్లు పెంచుతుంటే దాని మీద కదా మాట్లాడాలి. కర్ణాటక చర్య కారణంగా వంద టీఎంసీల నీళ్లను మనం నష్టపోయే పరిస్థితి ఉంది. దీనిపై ఏమాత్రం చర్చ జరపకుండా ఒక లెటర్ రాసి సైలెంటుగా ఉన్నారు. అసలు ఆల్మట్టి ఎత్తు పెంపుపై ఎందుకు మాట్లాడలేదు. కృష్ణా జలాలపై ఎందుకు చర్చించలేదు? బీఆర్ఎస్ ను తిట్టి పొలిటికల్ గా ప్రయోజనం పొందేందుకు చర్చ జరిగినట్లు ఉంది. నిజంగా పాలమూరు జిల్లాపై ఈ ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉందా? “

కేంద్రం డబుల్ గేమ్

“జాతీయ హోదానే ఇవ్వమని చెప్పిన కేంద్రం…కర్ణాటక ఎన్నికల కోసం అప్పర్ భద్రకు ఆ హోదా ఇచ్చింది. దీని కారణంగా తుంగభద్రకు రావల్సిన నీళ్లను వాళ్లు ఆపుకున్నారు. అదే విధంగా ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుతున్నారు. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. ఈ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వంతో ఎందుకు మాట్లాడటం లేదు?

భవిష్యత్తులో మహారాష్ట్రతో ఇబ్బంది వస్తే ఎలా అన్న దానిపై కూడా చర్చించాలి కదా? తన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి కురచ మనసుతో మాట్లాడారు. రేవంత్, ఉత్తమ్ లకు చిత్తశుద్ధి ఉంటే అప్పర్ భద్ర జాతీయ హోదా, ఆల్మట్టి ఎత్తు పెంపునకు వ్యతిరేకంగా తీర్మానం చేయండి. ఆల్మట్టి ఎత్తు తగ్గించేలా రేవంత్ రెడ్డి కృషి చేయాలి. లేదంటే ఆయనను పాలమూరు ప్రజలు క్షమించరు. నారాయణ పేట్- కొండగల్- మక్తాల్ ఇన్ టేక్ పాయింట్ ను జూరాల నుంచి మార్చుకోవాలి. పాలమూరు ప్రజలకు ఎంతో మేలు చేసే అవకాశాన్ని వదులుకొని చరిత్ర హీనులు కావద్దు.”

The post ఆల్మట్టి ఎత్తు పెంపు, అప్పర్ భద్రకు జాతీయ హోదాను వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేయాలి appeared first on Telangana Jagruthi.

నిరుపయోగంగా మార్కెట్ కాంప్లెక్స్ -కల్వకుంట్ల కవిత | సూర్యాపేట మార్కెట్ సందర్శన | (సూర్యాపేట)
కోట్లు వెచ్చించి నిర్మించిన సూర్యాపేట ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను వినియోగంలోకి తేవడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. జాగృతి జనంబాటలో భాగంగా శనివారం సూర్యాపేట మార్కెట్ ను సందర్శించి రైతులు, చిరువ్యాపారులతో మట్లాడారు.

పెద్ద ఎత్తున కట్టిన ఇంటిగ్రేటేడ్ మార్కెట్ ఎందుకు వాడకంలో లేదో సమీక్షించాలని కోరారు. రైతులకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ మార్కెట్ కట్టినా ఏ మాత్రం నాణ్యత లేదని కవిత విమర్శించారు. రీ సౌండ్ తో ఇబ్బందిగా ఉందని, గాలి కూడా రావటం లేదని రైతులు చెబుతున్నారన్నారు.

ప్లాట్ ఫామ్ ఎత్తుగా కట్టడం వల్ల బయట మెట్ల నుంచి ప్లాట్ ఫామ్ వరకు కూరగాయలు తీసుకెళ్లటం రైతులకు, ఇబ్బందిగా మారిందని వివరించారు.

మార్కెట్లో కూరగాయలు అమ్మే వాళ్లలో మహిళలు, పెద్ద వయసు వాళ్లే ఎక్కువగా ఉన్నారని, మెట్ల నుంచి ప్లాట్ ఫామ్ వరకు కూరగాయలు తీసుకెళ్లటం వారికి ఇబ్బందిగా మారిందని కవిత చెప్పారు. దీంతో వాళ్లంతా  మార్కెట్ బయటనే కూరగాయలు అమ్ముతున్నారని వివరించారు. రూ. 50 కోట్లతో ఇంత లోపభూయిష్టంగా మార్కెట్  కాంప్లెక్స్ నిర్మించడం దారుణమన్నారు.

ఇక్కడ ఎమ్మెల్యే ప్రతిపక్షం నుంచి ఉండటం వల్ల ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందని చెప్పారు. ప్రభుత్వం పూనుకొని సత్వరమే మార్కెట్ ను అందుబాటులోకి తేవాలని కవిత డిమాండ్ చేశారు. ఇలాంటి సమస్యలపైనే జాగృతి జనంబాట చేపట్మేటామని వెల్ములడించారు. రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలపై పోరాటం చేస్తున్నామన్నారు. అధికారులపై ఒత్తిడి పెంచి ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. సూర్యాపేట ఇంటిగ్రేటేడ్ మార్కెట్ విషయంలో కలెక్టర్  దృష్టి పెట్టాలని, చిన్నపాటి సమస్యలతో ఈ మార్కెట్ అందుబాటులో లేకుండా పోయిందని కవిత సూచించారు.

The post నిరుపయోగంగా మార్కెట్ కాంప్లెక్స్ -కల్వకుంట్ల కవిత | సూర్యాపేట మార్కెట్ సందర్శన | (సూర్యాపేట) appeared first on Telangana Jagruthi.

ప్రజలేమైనా ఓటింగ్ మెషీన్లా -కల్వకుంట్ల కవిత
విద్యా, వైద్యమే ప్రధానంగా పాలన సాగాలి | (తుంగతుర్తి)

ప్రజల అవసరాలు తీర్చాలన్న సోయి మరచి ప్రజలంటే ఓట్లు వేసే మెషీన్లుగానే నాయకులు భావించే పరిస్థితి వచ్చిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. రాజకీయాల్లో ఇలాంటి సంస్కృతి పోయి…కొత్త పంథా రావాలని కోరారు. జాగృతి జనంబాటలో భాగంగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని నూతన్ కల్ లో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కృష్ణవేణి, సీనియర్ నాయకులు సయ్యద్ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో కల్వకుంట్ల కవితకు ఘన స్వాగతం. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కవిత మాట్లాడుతూ

అధికారం, పదవులు తప్ప జనం బాధలు పట్టించుకునే నాయకులే కరవయ్యారని చెప్పారు.

ప్రభుత్వ అలసత్వం

“జనం బాటలో భాగంగా తుంగతుర్తి నియోజకవర్గంలో

చాలా చోట్ల పాడు పాడిన కాల్వలు దర్శనమిస్తున్నాయి.

100 పడకల హాస్పిటల్, రుద్రమచెరువు బాగు చేస్తామని ఇచ్చిన మాటలు ప్రభుత్వాలు నిలబెట్టుకోలేదు. తుంగతుర్తిలో 100 పడకల హాస్పిటల్ ను 2018 నుంచి కడుతూనే ఉన్నారు. గత ప్రభుత్వంలో శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం మారాక మళ్లీ శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వంలో నాలుగేళ్లు, ఈ ప్రభుత్వంలో రెండేళ్లుగా హాస్పిటల్ కడుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఉన్న 30 పడకల హాస్పిటల్ కు మూడున్నర లక్షల మంది వస్తున్నారని ఇక్కడ సిబ్బంది చెబుతున్నారు. సరైన వసతలు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ హాస్పిటల్ కు రావటం లేదు. దీంతో నెలకు ఇక్కడ రెండు డెలివరీలు మాత్రమే అవుతున్నాయి.

తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు ప్రైవేట్ కు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు. పేదలను ఆదుకోవల్సిన ప్రభుత్వాలు ఆలస్యం చేస్తున్నాయి. మనకు ప్రధానంగా కావాల్సింది విద్య, వైద్యమే కదా? హాస్పిటల్ నిర్మాణం ఎందుకు ఆలస్యమవుతుందని ప్రశ్నిస్తే బిల్లులు రావటం లేదని కాంట్రాక్టర్ చెబుతున్నాడు. విద్య, వైద్యం మీద కాకుండా ఈ ప్రభుత్వం దేని మీద ఖర్చు చేస్తుంది..?

పెన్షన్లు పెంచుతాం, ఫ్రీ కరెంట్, ఫ్రీ గ్యాస్, రైతు బంధు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ ఇచ్చిన హామీల్లో ఏదీ నెరవేర్చలేదు. మనం పిడికిలెత్తి గట్టిగా నిలదీయకపోవటంతోనే ప్రభుత్వం హామీలు విస్మరిస్తోంది.

ఇప్పుడు ఓట్లు లేవు. నేను ఓట్లు అడగటానికి కూడా రాలేదు. గత 10, 12 ఏళ్లుగా పెండింగులో ఉన్న పనులను ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి చేయిస్తున్నాం. “

హామీల అమలుకు పోరు

“సూర్యాపేట పేరులోనే సూర్యుడు ఉన్నాడు.

మల్లు స్వరాజ్యం, బండి యాదగిరి, మారోజు వీరన్న లాంటి మహనీయులను కన్న జిల్లా ఇది. వాళ్ల స్ఫూర్తితో మేము ప్రజల కోసం పోరాటం చేస్తాం. సూర్యాపేట జిల్లాకు రాగానే నాలో ఎంతో స్ఫూర్తి వచ్చింది. మీ స్ఫూర్తిని తీసుకొని వెళ్తున్నా. ఇంతటి చైతన్యవంతమైన ప్రజలకు కూడా నాయకులు పనిచేయటం లేదు. సమాజంలోని అట్టడుగు వారి కోసం, మహిళలు, యువత కోసం జాగృతి పోరాడుతుంది. ఆడబిడ్డలంటే నాకు కొంచెం పక్షపాతం ఎక్కువ. వారికి విద్య, వైద్య సదుపాయాలు బాగుండాలని నేను కోరుకుంటా. అందుకే ప్రతి జిల్లాలో విద్య, వైద్య వసతులు ఎలా ఉన్నాయో తెలుసుకుంటున్నా. ముఖ్యంగా ప్రసూతి హాస్పిటల్ లో సౌకర్యాలు ఎలా ఉన్నాయో అడుగుతున్నా. నాకు మీ దీవెనెలు కావాలి. మీ దీవెనెలు ఉంటే తెలంగాణ అంతా బాగున్నట్టే. తెలంగాణ కోసం ఉద్యమకారులు దుగ్యాల రవీందర్ రావు ఎంతో కొట్లాడారు. ఉద్యమ సమయంలో  12 వందల మంది అమరులయ్యారని బీఆర్ఎస్ చెప్పింది. కానీ వారందరికీ సాయం చేయలేదు. అమరుల కుటుంబాలకు కోటి సాయం అందే వరకు పోరాటం చేస్తాం. ఉద్యమకారులకు ప్రభుత్వం ఇస్తామన్న 250 గజాల స్థలం, రూ. 25 వేల పెన్షన్ ఇవ్వాలి.

ఆ భూమి ఇచ్చే వరకు ప్రతి జిల్లాలో ప్రభుత్వ భూమిని మేమే ఆక్రమించి ఉద్యమకారులకు పట్టా రాసి ఇస్తున్నాం.”

The post ప్రజలేమైనా ఓటింగ్ మెషీన్లా -కల్వకుంట్ల కవిత appeared first on Telangana Jagruthi.

కేసీఆర్ చేత శంకుస్థాపన-పనులింకా పెండింగే -కల్వకుంట్ల కవిత | తుంగతుర్తి
జాగృతి జనంబాటలో భాగంగా శనివారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సూర్యాపేట జిల్లా

తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని కమ్యునిటీ హెల్త్ సెంటర్ ను సందర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అసంపూర్తిగా ఉన్న వంద పడకల ఆస్పత్రని పరిశీలించి నిర్మాణ పనులు ఆలస్యం కావడానికి కారణాలపై ఆరాతీశారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు.

ప్రభుత్వాలు మారినా పనులు కాలేదు

“తుంగతుర్తిలో40 ఏళ్లుగా 30 పడకల హాస్పిటలే ఉంది. దీన్ని వంద పడకల హాస్పిటల్ గా మారుస్తామని 2018 లో కేసీఆర్ వచ్చి మాట ఇచ్చారు. కానీ 2022 వరకు కూడా మొదలు, మోక్షం లేకుండా ఉండిపోయింది. 2022 లో జీవో ఇచ్చి అప్పటి హెల్త్ మినిస్టర్ హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా వచ్చి మళ్లీ శంకుస్థాపన చేశారు. రెండు సార్లు శంకుస్థాపన చేసినప్పటికీ పనులు మాత్రం పూర్తి కాలేదు. కేసీఆర్ హామీ ఇచ్చిన తర్వాత కూడా ఇన్ని సంవత్సరాలు హాస్పిటల్ నిర్మాణం పెండింగులో ఉంది. పైగా ఉన్న హాస్పిటల్ ను సగానికి కూలగొట్టారు. దీంతో వైద్య సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఆరు మండలాల ప్రజలకు సరైన వైద్య సదుపాయం లేని పరిస్థితి వచ్చింది. నెలకు రెండు డెలివరీలు మాత్రమే ఇక్కడ జరుగుతున్నాయి. విధి లేని పరిస్థితుల్లో ప్రజలంతా ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్తున్నారు. వీలైనంత తర్వగా ఈ హాస్పిటల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా.”

The post కేసీఆర్ చేత శంకుస్థాపన-పనులింకా పెండింగే -కల్వకుంట్ల కవిత | తుంగతుర్తి appeared first on Telangana Jagruthi.

సాగునీటిపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం -కల్వకుంట్ల కవిత | (తుంగతుర్తి)
ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో సాగునీటి సమస్య పరిష్కారానికి పెద్ద చెరువులను రిజర్వాయర్లుగా అభివృద్ధి చేయాల్సిన అవసరముందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి జనంబాటలో భాగంగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని వెలుగుపల్లి రుద్రమచెరువును ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ   ఎస్సారెస్పీ స్టేజ్ 2 లో భాగంగా నల్గొండ జిల్లాలో రిజర్వాయర్లు రావాల్సిన అవసరం ఉందన్నారు.  రుద్రమచెరువును 5 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ గా రూపొందిస్తామని బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు స్థానికులకు ఆశలు కల్పించి ఓట్లు దండుకున్నాయని విమర్శించారు. ఈ చెరువును లక్నవరంలా పర్యటక కేంద్రం చేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నా పనులు మాత్రం చేపట్టడం లేదన్నారు. 700 ఎకరాల్లో విస్తరించి ఉన్న రుద్రమ చెరువు ఈ ప్రాంత రైతుల అవసరాలు తీర్చాలంటే ఇక్కడికి గోదావరి జలాలు రప్పించాలన్నారు. కిలోమీటర్ కు పైగా డిస్ట్రిబ్యూటరీ కాల్వ తవ్వకపోవటం కారణంగా గోదావరి నీళ్లు రావటం లేదని చెప్పారు. ఈ చెరువును భారీ రిజర్వాయర్ గా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.

కాల్వల నిర్వహణ ఏది

అంతకుముందు తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాలకు నీళ్లు ఇచ్చే ఎస్సార్ ఎస్పీ స్టేజీ -2 కాల్వను కవిత పరిశీలించారు. రాష్ట్రంలో పంట కాల్వల మెయింటేనెన్స్ సరిగా లేదని విమర్శించారు. కాల్వల్లో కంప చెట్లు పెరిగాయని చెప్పారు. వీటి మెయింటెనెన్స్ కోసం బీఆర్ఎస్ కానీ ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గానీ ఒక్కపైసా విడుదల చేయలేదన్నారు.

ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగానికి కనీసం నిధులు ఇవ్వటం లేదని తెలిపారు. కోదాడ వరకు నీళ్లు ఇచ్చే డిస్ట్రిబ్యూటరీ కాల్వ 70 కిలోమీటర్లు ఉంటుంది.. ఈ కాల్వను సరిగా మెయింటెన్ చేయటం లేదను కవిత విమర్శించారు.

చెరువులోనే స్కూల్

అర్వపల్లి మండలంలోని కేజీవీబీ స్కూల్ సందర్శించిన సందర్భంగా అక్కడి దుర్భర పరిస్థితి తెలిసిందని కల్వకుంట్ల కవిత చెప్పారు. ఎప్పుడు వర్షం వచ్చినా సరే ఆ స్కూల్ ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగిపోతుందని తెలిపారు. పూర్తిగా చెరువులో కట్టటంతో ఎప్పుడు నీళ్లు నిలిచి దోమల బెడద ఉంటుందని పేర్కొన్నారు. గతేడాదిలో తుపాన్ వచ్చి స్కూల్ మునిగిపోతే కలెక్టర్ వచ్చి పరిశీలించారు.. కానీ ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకోలేదన్నారు. సూర్యాపేట జిల్లాసాయుధ, విప్లవ పోరాటాలకు పెట్టింది పేరని, సాయుధ పోరాటం నాటి నుంచి ఎన్నో ఉద్యమాల్లో ఎంతో మంది అమరులయ్యారని కవిత కొనియాడారు. బండెనుక బండి కట్టి అనే పాట రాసిన బండి యాదగిరిది కూడా ఇదే జిల్లా అని గుర్తు చేశారు. సూర్యాపేట జిల్లాలో అభివృద్ధి ఎక్కడ ఆగిపోయిందో మా లాంటి సంస్థలు జిల్లా అభివృద్ధిలో ఎలాంటి పాత్ర పోషించాలన్న దానిపై దృష్టి పెట్టామని చెప్పారు.

The post సాగునీటిపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం -కల్వకుంట్ల కవిత | (తుంగతుర్తి) appeared first on Telangana Jagruthi.