భారీగా తరలివచ్చిన జాగృతి నాయకులు, అభిమానులు

(హైదరాబాద్ ):

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత  జన్మదిన వేడుకలను శుక్రవారం అట్టహాసంగా నిర్వహించారు. గురువారం రాత్రి 12 గంటలు దాటిన తర్వాత జాగృతి నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. శుక్రవారం ఉదయం వేద పండితులు ఆశీర్వాదం ఇవ్వగా, బంజారా పుజారులు కవితను దీవించారు. జాగృతి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు భారీ ఎత్తున తరలి వచ్చి ఆమెకు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో అభిమానులతో కలిసి కవిత కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా భారీ గజమాలతో జాగృతి నాయకులు, కార్యకర్తలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. పలువురు నాయకులు, శ్రేయోభిలాషులు, కార్యకర్తలు, నాయకులు, పలువురు ప్రముఖులు ఆమెను కలిసి బర్త్ డే విషెష్ తెలిపారు.  రాష్ట్ర వ్యాప్తంగానూ జాగృతి నాయకులు, అభిమానులు ఘనంగా కవిత బర్త్ వేడుకలు నిర్వహించారు. అంతకుముందు కవితను వారి నివాసంలో బంజారా పీఠాధిపతులు, వేద పండితులు ఆమెకు వేద అశీర్వచనం అందజేశారు. 

గోధుమలతో భారీ చిత్రం

యూపీలో గోధుమలతో కల్వకుంట్ల కవిత భారీ చిత్రాన్ని ప్రదర్శించారు. ఉత్తర ప్రదేశ్ లోని మురాదాబాద్ లో జావేద్ మాలిక్ అనే కళాకారుడు బిల్డింగ్ టెర్రస్ పై గోధుమలతో బతుకమ్మ ఎత్తుకున్న కవిత భారీ పటాన్ని చిత్రించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన తెలంగాణ జాగృతి యువ నాయకులు మైలారం అరుణ్ రెడ్డి, కృష్ణారెడ్డి కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు ఈ చిత్రపటం ఏర్పాటు చేయించారు. 

డాక్యుమెంటరీ విడుదల

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా జాగృతి నాయకుడు చిన్ను గౌడ్ డాక్యుమెంటరీ ని రూపొందించారు. ప్రసాద్ ల్యాబ్స్ లో డాక్యుమెంటరీని ఆవిష్కరించిన కవిత తనయుడు ఆదిత్య ఆవిష్కరించారు. కవిత గారి తెలంగాణ ఉద్యమ ప్రస్థానం, తెలంగాణ సాంస్కృతిక వైభవం పునరుజ్జీవం కోసం కవిత గారు సాగించిన కృషి.. బతుకమ్మను విశ్వవ్యాప్తం చేయడానికి చేసిన పరిశ్రమ.. ప్రజాసమస్యల పరిష్కారం కోసం పడుతున్న తపన.. తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా చేస్తున్న ప్రయత్నాలను విజువల్ డాక్యుమెంటరీలో పొందుపరిచారు. డాక్యుమెంటరీ రూపొందించిన చిన్ను గౌడ్ ను కవిత తనయుడు ఆదిత్య ప్రశంసించారు. కార్యక్రమంలో జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్, ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి తదితరులు పాల్గొన్నారు. 

తనకు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, అభిమానులకు ఈ సందర్భంగా కవిత కృతజ్ఞతలు తెలిపారు.