గిగ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి

గిగ్ వర్కర్లు, డ్రైవర్ల ను అగ్రిగేటర్ సంస్థలు మోసం చేస్తున్నాయి

ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోని అగ్రిగేటర్ సంస్థలతో మాట్లాడి వాళ్లకు న్యాయం చేయాలి

–తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

(తెలంగాణ రక్షణ సేన, బంజారాహిల్స్, హైదరాబాద్)

అగ్రిగేటర్ సంస్థలతో గిగ్ వర్కర్లకు ఉన్న సమస్యను తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని పరిష్కరించాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత కోరారు. స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి సంస్థల్లో పనిచేస్తున్న లక్షలమంది గిగ్ వర్కర్లు, డ్రైవర్లు రోజంతా కష్టపడినా వారికి ఒక్క పైసా మిగలటం లేదని తెలిపారు. 

మూడేళ్లుగా రేట్లు పెంచాలని వాళ్లు అడుగుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శించారు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోని అగ్రిగేటర్ సంస్థలతో మాట్లాడాలని డిమాండ్ చేశారు. వాళ్లకు మంచి రేట్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కవిత సూచించారు. తమ సమస్యలు తీర్చాలంటూ ఇవ్వాళ మధ్యాహ్నం వరకు వాళ్లంతా బ్రేక్ డౌన్ చేస్తున్నారని తెలిపారు. 

ఇలాంటి ఆందోళన చేయాల్సిన పరిస్థితి రాకుండా ప్రభుత్వం ముందే చర్యలు తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డారు. గిగ్ వర్కర్లు, డ్రైవర్లకు తెలంగాణ రక్షణ సేన అండగా ఉంటుందని కవిత స్పష్టం చేశారు. ప్రభుత్వం పేద గిగ్ వర్కర్లు, ఆటో డ్రైవర్ల వైపు ఉండి వాళ్ల సమస్యలు వెంటనే తీర్చాలని హెచ్చరించారు.