నర్సింగ్ విద్యార్ధినులకు కృష్ణవేణి ఇస్మాయిల్ పరామర్శ 

(తెలంగాణ రక్షణసేన, సూర్యాపేట)

అస్వస్థతకు గురై సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థులను తెలంగాణ రక్షణసేన రాష్ట్ర నాయకులు సయ్యద్ ఇస్మాయిల్, తుంగతుర్తి నియోజవర్గం ఇంఛార్జి సూరారపు కృష్ణవేణి ఆదివారం పార్టీ నేతలతో కలిసి వెళ్ళి పరామర్శించారు. 15 మంది విద్యార్థినులు ఒకేసారి అనారోగ్యం బారిన పడడం ఆందోళన కలిగించిందని, మెరుగైన వైద్యం అందుతుందా లేదా అనే విషయాన్ని తెలుసుకున్నారు. విద్యార్థినులు, వారి తల్లి దండ్రులను కలిసి మాట్లాడి ధైర్యం చెప్పి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆసుపత్రిని సందర్శించిన వారిలో సతీష్ కుమార్, శ్యామ్ నాయక్, మహబూబ్ జానీ ఉన్నారు.