జాగృతి జనంబాటలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గురువారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా.

ఉప్పల్ నియోజకవర్గంలోని రామంతపూర్ లో పర్యటించారు. ఇందిరా నగర్ చెరువును పరిశీలించారు. చెత్తాచెదారం పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతున్న చెరువుతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు కవిత దృష్టికి తీసుకువచ్చారు. చెరువు భూములు కబ్జాకు గురయ్యాయని చెప్పారు. 

అంతకుముందు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇందిరా నగర్ లోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.