పోలీసులు వేధించిన బాలునికి న్యాయం జరగాలి -కల్వకుంట్ల కవిత | Kavitha Seeks Justice for Minor

యూసుఫ్ గూడలో రీల్స్ చేసుకుంటుంటే పోలీసులు మూడు రోజులు పోలీస్ స్టేషన్ లో ఉంచి ఇబ్బందులకు గురి చేసిన బాలుడు అజిత్ ను, అతడి తల్లిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. 

“యూసుఫ్ గూడ కు చెందిన బాలుడు అజిత్ రీల్స్ చేస్తుంటే పోలీసులు తీసుకెళ్లారు. మూడు రోజుల పాటు అతన్ని స్టేషన్ లో పెట్టారు. బాబు వాళ్ల అమ్మ వెళ్తే కూడా కనీసం చూపించలేదు. మైనర్ ను మూడు రోజుల పాటు స్టేషన్ లో ఎలా ఉంచుతారు? దీని మీద కొంతమంది హ్యూమన్ రైట్స్ కు కంప్లైంట్ చేశారు. హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా పోలీస్ డిపార్ట్ మెంట్ మీద స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకోవాలి. మైనర్ బాబును మూడు రోజులు స్టేషన్ లో ఉంచటంతో అతనికి చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. అతని వైద్యం ఖర్చు అంతా ప్రభుత్వమే భరించాలని హ్యూమన్ రైట్స్ కమిషన్ చెప్పింది. నిమ్స్ కు వెళితే మూడు లక్షల ఖర్చయింది. ప్రభుత్వం అది కూడా ఇవ్వలేదు. 

ఆ తర్వాత వెంటపడితే సీఎం రిలీఫ్ ఫండ్ కింద సగం మాత్రమే ఇచ్చారు. ప్రభుత్వమే తప్పు చేస్తుంది. కానీ అతని వైద్యం ఖర్చు భరించదు. ఆ బాబు మెంటల్ స్టేటస్ కూడా ఇబ్బందిగా మారింది. 

దాని కారణంగా స్కూల్ డ్రాప్ అవుట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన ఫ్యూచర్ ఏమవుతుంది? ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలి.

ఖమ్మంలో సాదినేని రామారావు మర్డర్ జరిగింది. దాంతోపాటు అజిత్ అంశంపై డీజీపీతో మాట్లాడ్డానికి అపాయింట్ మెంట్ కోరాం. కానీ ఆయన నుంచి ఇప్పటి వరకు స్పందన లేదు. ఈ రెండు ఇష్యూస్ ను నేను ట్విట్టర్ లో పెట్టి వారికి ట్యాగ్ చేస్తాను. డీజీపీ గారు త్వరితగతిన స్పందించి అజిత్ విషయంలో న్యాయం చేయాలి.

కచ్చితంగా బాబు వైద్యం, విద్య విషయంలో ప్రభుత్వమే అండగా ఉండాలి. లేదంటే మేము న్యాయపోరాటం చేసి బాధ్యులపై చర్యలు తీసుకునేలా చూస్తాం”