-కల్వకుంట్ల కవిత
కాచిగూడ హైస్కూల్ సందర్శన
జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మూడో రోజు హైదరాబాద్ జిల్లాలో పర్యటించారు. శుక్రవారం అంబర్ పేట్, సికింద్రాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో కవిత పర్యటించారు. అంబర్ పేట్ నియోజకవర్గంలోని కాచిగూడ హైస్కూల్ ను సందర్శించి విద్యార్థులు, టీచర్లతో మాట్లాడారు.


“ఇవ్వాళ అంబర్ పేట నియోజకవర్గంలోని కాచిగూడ జూనియర్ కాలేజ్, హైస్కూల్ ను పరిశీలించాం. 60 ఏళ్ల కింద కట్టిన ఈ బిల్డింగులోనే స్కూల్, కాలేజీ ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. కొత్త బిల్డింగ్ కోసం నిధులు వచ్చినప్పటికీ దాన్ని కాదని ఈ భవనాన్ని కొనసాగిస్తున్నారు. కనీసం పెయింటింగ్ కూడా వేయలేదు. ఇక్కడ పరిస్థితి చూస్తే కచ్చితంగా కొత్త బిల్డింగ్ అవసరమన్నట్లుగా ఉంది. ఇక్కడే రెండు ప్రైమరీ స్కూళ్లతో పాటు ఎస్టీ హాస్టల్ కూడా నడుపుతున్నారు. దీంతో చాలా బర్డెన్ అవుతోంది. దానికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు లేవు. మోడర్న్ ఎడ్యుకేషన్ వైపు మనం వెళ్తున్నప్పటికీ ఇక్కడ దానికి అనుగుణంగా ఎలాంటి ఏర్పాట్లు లేవు. లైబ్రరీ వసతి లేదు. కంప్యూటర్లు కూడా అవసరమైనన్ని లేవు. ఎంపీసీ, బైపీపీ విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఈ కాలేజీకి వచ్చే వాళ్లంతా పేద పిల్లలే. వారికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలి.

మధ్యాహ్న భోజనం కోసం బయటకు వెళ్తున్న స్టూడెంట్స్ మళ్లీ రావటం లేదు. దీంతో పాస్ పర్సెంటేజీ తక్కువగా ఉంటోంది. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. మిడ్ డే మీల్స్ పెట్టేందుకు ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే జాగృతి తరఫున ఏదైనా సంస్థ ద్వారా భోజనం పెడతాం. అందుకు కావల్సిన పర్మిషన్ల కోసం కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా సరే టీచర్లు ఎంతో బాధ్యతగా పనిచేస్తున్నారు. వారికి చదువు తప్ప అన్ని ఎక్స్ ట్రా బర్డెన్లు పెడుతున్నారు. అయినా ఓపికతో పనిచేస్తున్న టీచర్లకు హృదయ పూర్వకంగా అభినందనలు.”








