-కల్వకుంట్ల కవిత
సికింద్రాబాద్ గురుద్వారా నుంచి జరుగుతున్న ప్రజాసేవ ఎంతో ప్రశంసించదగ్గదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం జాగృతి జనంబాటలో భాగంగా నిర్వహించిన పర్యటనలో సికింద్రాబాద్ గురుద్వారాను ఆమె సందర్శించారు. సిక్కు పెద్దలతో కలిసి ప్రార్థనలు చేశారు. అతిథులకు వడ్డించి తాను కూడా భోజనం చేశారు కవిత. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గురుద్వారాకు తాను గతంలో కూడా వచ్చానని చెప్పారు. ఇక్కడ నిర్వహించే ఉచిత వైద్య సేవలు అభినందించ తగినవన్నారు. ఇవి ఇలాగే కొనసాగించాలని అభిలషించారు. కమిటీ సభ్యులు అభినందనీయులని ప్రశంసించారు. గురుద్వార ప్రహారీని చూస్తేనే ఎంతో స్ఫూర్తివంతంగా ఉంటుందన్నారు.



















