చాంద్రాయణగుట్ట హాస్టల్ సందర్శన | (చాంద్రాయణగుట్ట)
జాగృతి జనంబాటలో భాగంగా చాంద్రాయణ గుట్ట బీసీ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్ లో పరిస్థితులు చూసి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్లో విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారిందని చెప్పారు. మొత్తం 147 మంది విద్యార్థులకు 11 రూమ్ లు మాత్రమే ఉన్నాయని, ఒక్కో రూమ్ లో 25 మందిని ఉంచటం విచారకరమన్నారు. అది కూడా 2018 లో విద్యార్థులు ధర్నా చేస్తే ఆమాత్రం బిల్డింగ్ కిరాయికి తీసుకున్నారని తెలిపారు. మూడేళ్లుగా ఈ బిల్డింగ్ రెంట్ కూడా కట్టటం లేదని.. దీంతో రిపేర్లు కూడా చేయటం లేదని కవిత వెల్లడించారు. భవన యజమాని మంచి వ్యక్తి కావటంతో కిరాయి బకాయి ఉన్నా ఇంకా ఈ హాస్టల్ ను కొనసాగనిస్తున్నారని చెప్పారు. కుకింగ్ స్టాఫ్ చాలా మంచి వారు ఉన్నారని.. పిల్లలకు మంచి ఫుడ్ పెడుతున్నారని కవిత చెప్పారు.
జాగృతి నుంచి సహకారం
ఇక మిగతా ఏదీ కూడా ఇక్కడ హాస్టల్ మాదిరిగా లేదని కవిత చెప్పారు. హాస్టల్ కు ఉండాల్సిన సౌకర్యాలేవీ లేకపోవడం విచరకరణమన్నారు. చదువుకునే వాతావారణం కూడా లేదన్నారు. గ్రూప్స్ కు ప్రిపేర్ అయ్యే వాళ్లు, వేరే కాలేజ్ లకు వెళ్లే వాళ్లు ఉన్నారని తెలిపారు.
ఇక్కడ లైబ్రరీలో ఒక్క ర్యాక్ మాత్రమే ఉందని.. గ్రూప్స్ కు సంబంధించి ఒక్క పుస్తకం లేదని చెప్పారు. విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండటానికి జాగృతి సంస్థ నుంచి ఎంతో కొంత సాయం చేయటానికి ప్రయత్నిస్తామని కవిత ప్రకటించారు. బీసీ అధికారులు వెంటనే వచ్చి రెంట్ కట్టి విద్యార్థులకు బెడ్లు, దుప్పట్లు ఇవ్వాలని కోరారు.
లేదంటే మేమే వారికి బెడ్ షీట్లు, ఇండోర్ గేమ్స్ కు కావాల్సిన ఆట వస్తువులు అందజేస్తామని వెల్లడించారు.
జాగృతి లాంటి సంస్థలు చేస్తే కొంతమందికి మాత్రమే అందుతాయని, అదే ప్రభుత్వం చేస్తే చాలా మందికి మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
ఇలాంటి చోట్ల మన పిల్లలుంటారా
చాంద్రాయణగుట్ట బీసీ వెల్ఫేర్ హాస్టల్లో పిల్లల పరిస్థితి చాలా బాధాకరంగా ఉందని.. మన పిల్లలనైతే ఇలాంటి హాస్టల్స్ ఉంచుతామా అని కవిత ప్రశ్నించారు. బీసీ వెెల్ఫేర్ మంత్రి, ముఖ్యమంత్రి, అధికారులు ఈ విషయం ఆలోచించాలని సూచించారు. 2018 నుంచి కనీసం బేసిక్ అవసరాలను కూడా తీర్చలేదంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. చాలా పేద బ్యాక్ గ్రౌండ్ ఉన్న పేద విద్యార్థుల గురించి ప్రభుత్వం పట్టించుకోవాలి. బెడ్స్, దుప్పట్లు లేకుండా వాళ్లంతా ఎలా ఉంటారో ఆలోచించాలి.
ఈ విద్యార్థులే మన భవిష్యత్తని చెప్పారు. వాళ్లకు మంచి చేసే ప్రయత్నం చేయాలని కోరారు.



ప్రకటనలకే పరిమితం
గతంలో కేసీఆర్ ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తానని చెప్పారు. రేవంత్ రెడ్డి వచ్చాక ఓల్డ్ సిటీయే ఒరిజినల్ సిటీ అన్నారు. కానీ ఒక్కరు కూడా ఓల్డ్ సిటీ పరిస్థితి మార్చేందుకు నిధులు ఇవ్వలేదని కవిత విమర్శించారు. మూసీకి సంబంధించిన పెద్ద నాలాను కూడా చూశాం. గతేడాది వచ్చిన వరదలకు ఇక్కడ కార్లు, బైక్ లు నీళ్లలో కొట్టుకుపోయాయని గుర్తు చేశారు. చాలా భయంకరమైన పరిస్థితి ఉంది. వరదల భయానికి ఇక్కడి ప్రజలు గడపలను ఎత్తుగా కట్టుకున్నారని తెలిపారు. ఈ పరిస్థితి మారటానికి తనవంతు ప్రయత్నం చేస్తానని ప్రకటించారు. ప్రతి గుడి, మసీదు దగ్గర మూడు, మూడు వైన్ షాపులు ఉన్నాయి. స్కూళ్లతో పాటు ఆలయాల వద్ద వైన్ షాపులకు ఎలా పర్మిషన్స్ ఇచ్చారని కవిత ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో గుడి ముందే ఓపెన్ బార్ కు పర్మిషన్ ఇచ్చారు.. దాన్ని తొలగించేందుకు మేమే ప్రయత్నిస్తామని కవిత స్పష్టం చేశారు.








