సీఎం రేవంత్ రెడ్డి గంట ఎంటర్ టైన్ మెంట్ కోసం పది కోట్లు ఖర్చు చేశారు
ఈ ఫుట్ బాల్ మ్యాచ్ కారణంగా తెలంగాణకు వచ్చిన ప్రయోజనం ఏంటి?
సింగరేణి కార్మికుల సొమ్మును ఇందుకోసం వాడారు
కాంగ్రెస్ పార్టీ ఫండ్ నుంచి సింగరేణికి రూ.10 కోట్లు చెల్లించాలి
రాహుల్ గాంధీ చిక్కడపల్లి లైబ్రరీ కి రాకుండా మ్యాచ్ చూసేందుకు వస్తారా?
బాలసుబ్రమణ్యం విగ్రహం విషయంలో నేను తెలంగాణ వాదుల పక్షానే ఉంటా
హైదరాబాద్ లో డివిజన్ల ను అశాస్త్రీయంగా డివైడ్ చేశారు
హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా, డ్రైనేజీ, మంచినీటి సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు
(బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్)

సీఎం రేవంత్ రెడ్డి గంట ఎంటర్ టైన్ మెంట్ కోసం పది కోట్లు ఖర్చు చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. రేవంత్ ఫుట్ బాల్ ఆడుతానని ప్రచారం చేసుకోవటానికి ఆడినట్లు ఉందని విమర్శించారు. జాగృతి జనంబాటలో భాగంగా నగరంలో పర్యటిస్తున్న కవిత ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఫుట్ బాట్ మ్యాచ్ వల్ల తెలంగాణ ప్రజలకు ఏమీ ప్రయోజనం ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు.
“ఈ పదికోట్లను కూడా సింగరేణి బిడ్డల నిధి నుంచి ఖర్చు చేశారు. ఇప్పటికే సింగరేణి డబ్బును సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ కు తీసుకెళ్లారు. సింగరేణి డబ్బు ను అక్కడ ప్రజల కోసమే వాడాల్సి ఉంది. సీఎం ఫుట్ బాల్ గేమ్ తెలంగాణ ప్రజలకు పనికి రాలేదు. వాళ్లు రీల్స్ చేసుకోవటానికి మాత్రమే పనికి వచ్చింది. కచ్చితంగా సింగరేణి డబ్బును కాంగ్రెస్ తన పార్టీ ఫండ్ నుంచి రిటర్న్ ఇవ్వాలి. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం లో ఈ విధంగా ఖర్చు చేసి ఉంటే దానిపై కూడా సమాధానం చెప్పాలి.
రాహుల్ గాంధీ గారు చిక్కడపల్లి లైబ్రరీకి వెళ్లకుండా మ్యాచ్ కోసం స్టేడియం కు వెళ్లారు. విద్యార్థులకు ఇచ్చిన హామీలను పట్టించుకోకుండా ఏదో రాజుల అన్నట్లుగా ఇలా వచ్చి అలా ఆయన ఢిల్లీకి వెళ్లారు.
అశాస్త్రీయంగా డివిజన్లు
హైదరాబాద్ లో డివిజన్ల డివిజన్ అశాస్త్రీయంగా జరిగింది. ఒకే పార్టీ గెలిచే విధంగా వాటిని డివిజన్ చేశారని ప్రజలు చెబుతున్నారు. అసలు ఏ ప్రతిపాదికన డివిజన్లను డివైడ్ చేశారో చెప్పాల్సిన అవసరముంది. ఓల్డ్ సిటీలో, న్యూ సిటీలో డివిజన్లను అశాస్త్రీయంగా డివైడ్ చేశారు. మల్కాజ్ గిరి లో గతంలో 500 మంది ప్రజా ప్రతినిధులు ఉంటే…ఇప్పుడు 40 మందే ఉండే పరిస్థితి తెచ్చారు.
లోకలైజ్డ్ ను సెంట్రలైజ్డ్ చేశారు. ఇది ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేకుండా ఉంది. “
బాలు విగ్రహం మనకెందుకు
“జయ జయహే గీతం పాడనని బాల సుబ్రమణ్యం గారు అన్నట్లు ఆరోపణ ఉంది. అందుకే ఆయన విగ్రహాం విషయంలో నేను తెలంగాణ వాదుల పక్షానే ఉంటా. రవీంద్రభారతి లో తెలంగాణ జానపద కళాకారుల విగ్రహాలు ఏర్పాటు చేయాలి. సినీ కళాకారుల విగ్రహాలను నేను వద్దు అనటం లేదు. కానీ వాటి కోసం ఇతర ప్రాంతాలను ఎంచుకోవాలని సూచిస్తున్నా. జనం బాటలో భాగంగా హైదరాబాద్ లో ఐదు రోజులు పర్యటించాం. హైదరాబాద్, సికింద్రాబాద్ లోని నియోజకవర్గాలను కవర్ చేశాం. ప్రధానంగా హైదరాబాద్ అంటేనే తెలంగాణకు గుండెకాయ.

హైదరాబాద్ లేకుండా తెలంగాణ ఇస్తామంటే మనం ఊరుకోలేదు. పట్టు పట్టి మరీ హైదరాబాద్ తో ఉన్న తెలంగాణను సాధించుకున్నాం. హైదరాబాద్ గ్రోత్ ఇంజన్ గా 10 ఏళ్లు అభివృద్ధి జరిగింది. ఇంకా తెలంగాణలో అభివృద్ది కావాల్సిన అంశాలు చాలా ఉన్నాయి.
ఇప్పటికే కోటి మంది నివాసం ఉంటున్న సిటీలో మరో 27 మున్సిపాలిటీలను కలిపారు. కానీ దానికి తగిన విధంగా ప్రజా రవాణా సదుపాయం లేదు. గతంలో 7500 బస్సులుంటే ఇప్పుడు వాటిని 3500 బస్సులకు తగ్గించారు. సిటీలో ఎక్కడకు వెళ్లిన సరే బస్సుల సమస్య గురించే చెబుతున్నారు. బస్సులు తగ్గించటంతో వ్యక్తిగత వాహనాల సంఖ్య భారీగా పెరిగింది. రోడ్లు, ఫ్లై ఓవర్లు అనే హంగామా ఉన్న సరే ప్రజలకు ప్రజా రవాణా ఉండాలి.
డల్లాస్, సింగపూర్ నగరం మాదిరిగా కావాలంటే ప్రజా రవాణా ఉండాలి. ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చి ప్రైవేట్ వాళ్లకు అప్పగిస్తున్నారు. అంటే క్రమంగా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రైవేట్ పరమైతే వాళ్ల ఇష్టమొచ్చినట్లు ధరలు పెంచేస్తారు. గతంలో ఓల్డ్ సిటీలో సెట్విన్ బస్సులు చిన్న గల్లీలకు కూడా పోయేవి. కానీ ఇప్పుడు పెద్ద గల్లీలకు కూడా బస్సులు లేని పరిస్థితి.
వికలాంగులకు బస్ ఎక్కే సౌకర్యం లేకుండా పోయింది. వారికి ట్రాన్స్ పోర్ట్ సౌకర్యం కల్పించాలి. “
ట్రాఫిక్ పెరిగితే బస్సులు తగ్గించారు
“హైదరాబాద్ లో స్ట్రీట్ డాగ్స్ సమస్య చాలా పెరిగింది. మొన్న ఓ బాబుపై 20 కుక్కలు దాడి చేసి అతని చెవును కొరికాయి. చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయటంతో కుక్కల సమస్య పెరిగింది. 2022 లో 92, 924 కేసులు నమోదైతే 2024 లో లక్షా 21 వేల కేసులు నమోదయ్యాయి. కుక్కల కోసం ఉన్న బడ్జెట్ ను సరిగా వినియోగించటం లేదు.

ఇక హైదరాబాద్ క్రైమ్ రేటు పెరిగింది. క్రైమ్, మర్డర్లు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ వాళ్లను టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు. గతంలో సిటిజన్ పోలీసింగ్ అనేది ఉండేది. దాంతో క్రైమ్ చేయాలంటే భయం ఉండేది. ఇక హైదరాబాద్ లో చాలా చోట్ల డ్రగ్స్ సమస్య పెరిగిపోయింది. డ్రగ్స్ తీసుకునే ఏరియాలు ఎక్కడున్నాయో తెలిసిన సరే ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. లంగర్ హౌస్ లో బాపు ఘాట్ డ్రగ్స్ కు అడ్డాగా మారింది. యాకుత్ పురాలో మంచినీళ్ల సమస్య గురించి మేము మాట్లాడగానే ఆ సమస్యను తీర్చారు. ఇక సిటీలో చాలా చోట్ల మురికి నీళ్లు వస్తున్నాయి. అడిక్ మెట్ లో నీళ్లలో పెట్రోల్ వాసవ వస్తోంది. ఇంత మహానగరంలో మంచి నీళ్లు సరిగా ఇవ్వలేని పరిస్థితి. రసూల్ పుర లోని ఓ బస్తీలో సమస్యలు తెలుసుకునేందుకు మేము పోతున్నామనే తెలియటంతో ఎమ్మెల్యే స్పందించారు . అక్కడ టిప్పర్లను పెట్టించి చెత్త ఎత్తించారు. వారికి పట్టాలు ఇస్తామని హామీ కూడా ఇచ్చారు. బోయినపల్లిలో స్కూల్ ను పరిశీలించాం. రామన్నకుంట చెరువు వద్ద పరిస్థితి ఘోరంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడిచే ఎన్ఐఈపీసీ సేవలు బాగున్నాయి. వాటిని అన్ని జిల్లాలలో పెట్టే విధంగా బీజేపీ ఎంపీలు చర్యలు తీసుకోవాలి. సనత్ నగర్ లోని దాసరి బస్తీలో చెత్త ఆటోలను నిలుపుతున్నారు. ఇళ్ల మధ్యలో అలా చెత్త ఆటోలు నిలపటంతో అక్కడ గంజాయి బ్యాచ్ తయారైంది. మహిళలు ఆ ప్రాంతంలో వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. జీహెచ్ఎంసీ కమిషనర్ గారు విజిట్ చేసి ఆ ప్రాంతాన్ని బాగు చేయాలి.
జూబ్లీహిల్స్ లోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. అక్కడ నీళ్లు లీక్ అవుతున్న పట్టించుకోవటం లేదు. ఆడుకోవటానికి పిల్లలకు స్టేడియం ఇవ్వకుండా, పెళ్లిలకు, ఫంక్షన్స్ కు ఇస్తున్నారు.
కృష్ణకాంత్ పార్క్ వద్ద డంపింగ్ యార్డ్ ను మేము వస్తున్నామని నీట్ గా ముగ్గేసి క్లీన్ చేశారు. ఐతే పరిమితికి మించి చెత్త వస్తే ఏం చేయాలని అక్కడ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో జనాభాకు అనుగుణంగా సిబ్బంది ఉండేది. కానీ ఇప్పుడు ఔట్ సోర్సింగ్ కు ఇవ్వటం కారణంగా కావాల్సినంత సిబ్బందిని ఉంచటం లేదు.
ఎర్రగడ్డ ప్రేమ్ నగర్ లో చాలా సమస్యలు ఉన్నాయి.
మలక్ పేట్ గంజ్ లో లైట్లు, రోడ్లు బాగు చేయాలి.
హైదరాబాద్ లో పెండింగ్ లో ఉన్న బ్రిడ్జిల వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి. వెంటనే వాటిని పూర్తి చేసే ప్రయత్నం చేయాలి. నేషనల్ హై వే, జీహెచ్ఎంసీ వాళ్ల మధ్య కో ఆర్డినేషన్ లేకపోవటంతో ఆలస్యమవుతోంది.
యకుత్ పురా లోని హనుమాన్ నగర్ లో వర్షకాలంలో భారీగా నీళ్లు నిలుస్తున్నాయి. కుమ్మరి గూడలో కుమ్మరి వాళ్లకు మట్టి ఏర్పాటు చేయాల్సిన అవసరముంది.
సింగరేణి, ఖాజాబస్తీ, చింతల్ బస్తీ లో ఇళ్లను రెగ్యులరైజ్ చేయాలి. అన్ని ప్రభుత్వాలు వాళ్లకు హామీ ఇచ్చినప్పటికీ చేయటం లేదు. చార్మినార్ లో మల్టీ లెవల్ పార్కింగ్ ఇంకా ముందుకు పడలేదు. అంబర్ పేట్ ఛే నంబర్ రోడ్డును మేము పరిశీలించేందుకు వస్తున్నామని తెలిసి రాత్రికి రాత్రే వేశారు. ఒక్క రోజులో అయ్యే పనిని ఎందుకు పెండింగ్ పెడుతున్నట్లు? అంబర్ పేట్, ముషీరాం బాగ్ బ్రిడ్జి ని కూడా తొందరగా పూర్తి చేయాలి. అడిగే వాళ్లు ఉంటేనే పనులు అవుతాయి. అందుకే జాగృతి అడిగే పని పెట్టుకుంది.”
దశాబ్దాలుగా అభివృద్ధి కి నోచని బస్తీలు

” సికింద్రాబాద్ లోని మాణికేశ్వర్ నగర్ లో హాస్పిటల్ కోసం అక్కడి ప్రజలు 156 రోజులు ధర్నా చేశారు. దాంతో హాస్పిటల్ మంజూరు చేసినప్పటికీ ఇప్పటికీ పూర్తి చేయలేదు. చంద్రబాబు నాయుడు నగర్ లో సింగిల్ బెడ్ రూమ్ ఇళ్లను పూర్తి చేయాలి. సీతాఫల్ మండిలో కూలగొట్టిన స్కూల్ ను వెంటనే కట్టాలి. ఆ స్కూల్ కూలగొట్టటంతో అది అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. స్కూల్లో చదివే 650 మంది విద్యార్థుల్లో సగం మంది చెల్లాచెదురయ్యారు. వారసిగూడ లో 1956 నాటి రోడ్లే ఉన్నాయి. ఇక్కడ రోడ్ల పరిస్థితి మెరుగు చేయాల్సి ఉంది. అడిక్ మెట్ లో నీళ్లు పెట్రోల్ వాసన వస్తున్నాయి. జియాగూడలో మేకల మండిని అధునీకీకరించాలి. ఆ రూట్ కు వెళ్లే వంద ఫీట్ల రోడ్డును తొందరగా బాగు చేయాలి. జియాగూడ గోశాల చాలా పెద్దది. అక్కడ 8 వేల గోవులు ఉన్నాయి. ప్రతి వెటర్నరీ కాలేజ్ వాళ్లు అక్కడికి వస్తారు. కానీ ప్రభుత్వం ఒక్క సూది కూడా ఇవ్వటం లేదు.
ప్రభుత్వం తరఫున గోశాలకు సాయం అందించాల్సిన అవసరముంది. బహదూర్ పురలో ఎస్సీ కాలనీలు సందర్శించాం. అక్కడ పదేళ్లుగా పెన్షన్లు రావటం లేదు.
చాంద్రాయణ గుట్టలో బీసీ బాయ్స్ హాస్టల్ లో ఘోర మైన పరిస్థితులు ఉన్నాయి. 11 రూమ్ లో 147 మంది విద్యార్థులు ఉండాల్సిన పరిస్థితి ఉంది. వారం రోజుల్లో సౌకర్యాలు మెరుగుపర్చకుంటే మేము సాయం చేస్తామని చెప్పాం. ప్రభుత్వం పరువు పోవద్దంటే వెంటనే అక్కడ సౌకర్యాలు కల్పించాలి. ఖైరతాబాద్ లో 70 ఏళ్లుగా రెండు మక్తాల్లో పరిస్థితి ఏ మాత్రం మారలేదు. అక్కడి ప్రజలకు ఇళ్లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
నాంపల్లి లో బాల్ భవన్, పబ్లిక్ గార్డెన్స్ పబ్లిక్ కోసం ఓపెన్ చేయాలి. గోషామహల్ గుడుంబా ఫ్రీ అయ్యాక ధూల్ పేట్ కు ప్రత్యేకంగా ప్యాకేజ్ ఇస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. చాలా ఎయిడెడ్ స్కూల్స్, కాలేజ్ కూడా సిటీలో క్లోజ్ అయ్యే పరిస్థితి ఉంది. “
అన్నీ ప్రైవేటీకరిస్తున్నారు
“హైదరాబాద్ కు మంచినీళ్ల కోసం మల్లన్న సాగర్ నుంచి నీళ్లను తీసుకురావాలి. సుంకేశుల రిజర్వాయర్ ను కూడా హైదరాబాద్ కు నీళ్ల కోసం కడుతున్నాం. గతంలో రిటైనింగ్ వాల్ ఇక్కడ కూలితే ఆ సమాచారాన్ని సీఎం కనీసం అసెంబ్లీలో కూడా చెప్పలేదు. 14 వందల కోట్ల ఆ ప్రాజెక్ట్ ను 2 వేల 5 వందల కోట్లకు పెంచారు. అసలు హైదరాబాద్ ప్రజల దాహార్తిని ఎలా తీరుస్తారో ప్రభుత్వం చెప్పాలి? ప్రపంచం నలుమూలాల నుంచి హైదరాబాద్ కు చాలా మంది వస్తుంటారు? వాళ్లు రాగానే హైదరాబాద్ పై మంచి అభిప్రాయం ఉండాలంటే మంచి సౌకర్యాలు ఉండాలి.
హైదరాబాద్ లాంటి నగరాలకు కేంద్రం ప్రత్యేక ప్యాకేజ్ లు ఇవ్వాల్సిందే. సిటీలో నాలాలు, మంచి నీళ్ల వ్యవస్థ బాగు చేయాలంటే వేల కోట్లు కావాలి. అది కేంద్రం ప్రభుత్వం సహకారం ఉంటేనే సాధ్యమవుతుంది. 2019-2020 నుంచి 2023- 2024 లో కేంద్రానికి తెలంగాణ ట్యాక్స్ రూపంలో 4, 35, 990 కోట్లు ఇచ్చింది. రిటర్న్ గా కేంద్రం 3, 76, 000 కోట్లు మాత్రమే ఇచ్చారు. అంటే దాదాపు 60 వేల కోట్లు తక్కువగా ఇచ్చారు. ప్రత్యేక నిధులు కాదు కదా.. జనం ఇచ్చిన దాన్ని కూడా బీజేపీ తిరిగి ఇవ్వటం లేదు. హైదరాబాద్ లో మౌలిక వసతులపై దృష్టి పెట్టాల్సిన అవసముంది. ఇప్పటికే విద్యను పూర్తిగా ఇక్కడ ప్రైవేట్ పరం చేసేశారు. సిటికి నాలుగు వైపుల కట్టాలనుకున్న హాస్పిటల్స్ ఇప్పటికీ పూర్తి కాలేదు. దీంతో గాంధీ హాస్పిటల్ పై భారం ఎక్కువగా ఉంది. ఉస్మానియాకు వెళ్లే పరిస్థితి లేదు. నగరంలో ఉపాధి అంటే ఐటీ మీదే ఫోకస్ చేస్తున్నారు. మిడ్ లెవల్ ఎంట్రప్రెన్యూర్ పై ఎలాంటి దృష్టి పెట్టటం లేదు. ఇక సిటీలో లక్షా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కడతామని చెప్పిన బీఆర్ఎస్ 60 వేలు మాత్రమే కట్టింది.
వాటిని కూడా పూర్తిగా అర్హులకు ఇవ్వలేదు. సిటీలో ఎన్నో ఏళ్లుగా ఉంటున్న వారికి ప్రభుత్వం ఇళ్లను ఇవ్వాలి. హైదరాబాద్ లో ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇళ్లను ఎక్కువగా కేటాయించాలి. హైదరాబాద్ లాంటి ఫేమస్ నగరంలో మౌలిక సదుపాయాలు ఇంకా మెరుగ్గా ఉండాలి. “నగరంలో పర్యటన సందర్భంగా మా దృష్టికి వచ్చిన అన్ని సమస్యలను ఫాలో అప్ చేస్తాం.”








