నాంపల్లి బాలభవన్ సందర్శన (నాంపల్లి)
పిల్లల్లోని సృజనాత్మకతను వెలికితీసి మంచి కళాకారులుగా వారిని తీర్చిదిద్దే బాలభవన్లను బలోపేతం చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లోని జవహర్ బాల భవన్ ను ఆమె పరిశీలించారు. ప్రభుత్వం బాలభవన్లకు నిధులు కేటాయించకపోవడం విచారకరమన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలభవన్ వ్యవస్థను పటిష్టం చేసేవరకు జాగృతి పోరాటం చేస్తుంందని స్పష్టం చేశారు.


“నాంపల్లి లోని పబ్లిక్ గార్డెన్, బాల్ భవన్ ను విజిట్ చేశాం.
చిన్నప్పుడు బాల్ భవన్, ఆకాశ వాణి చూడటానికి వచ్చే వాళ్లం. ఇక్కడ అప్పట్లో అనేక కార్యక్రమాలు జరుగుతుండేవి. అలాంటి ఈ బాల్ భవన్ కు గత 12 ఏండ్లలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అయినప్పటికీ ఇక్కడకు కొంతమంది పిల్లలు వస్తున్నారు. ఆర్టిస్టులు కావాలనుకునే వారు, రిక్రియేషన్ కోసం కొంత మంది వస్తున్నారు. ఏదైనా ఒక చోటుకు వచ్చి అక్కడ చేసే యాక్టివిటీస్ పిల్లలు బాగా గుర్తు పెట్టుకుంటారు. నేను ఆకాశవాణికి ఒక్కసారే వచ్చాను. కానీ ఆ రోజు నాకు ఇప్పటికీ గుర్తు ఉంది. అలా బాల్యంలో పిల్లలకు ఉండే జ్ఞాపకాలను లేకుండా చేస్తున్నారు. 1939 లో నిజాం కాలంలో బ్యూటీ ఫుల్ హెరిటేజ్ బిల్డింగ్ ను కట్టారు. దాన్ని మనం కాపాడుకొని మెయింటైన్ చేయాలి. పిల్లలను ఇక్కడకు కంటిన్యూగా తెస్తే వాళ్లకు రిలాక్సేషన్ ఉంటుంది.
సిటిలో చాలా ప్రైవేట్ స్కూళ్లకు గ్రౌండ్స్ లేవు. ఆ స్కూళ్లలోని పిల్లలను కంటిన్యూగా తెస్తే మంచి రిలాక్సేషన్ ఉంటుంది. విద్యార్థులుకు యాక్టివిటీస్ తో నాలెడ్జ్ పెరుగుతుంది. ఇక బాగేయామ్ అంటే పబ్లిక్ కోసం ఫ్రీ గా పబ్లిక్ గార్డెన్. ఇక్కడకు ప్రజలు రావాలంటే మంచి సౌకర్యాలు ఉండాల్సిన అవసరముంది. లేక్ పరిసర ప్రాంతాల్లో సరైన మెయింటెనెన్స్ చేయాల్సి ఉంది. మిడిల్ ఆఫ్ ది సిటీలో ఇంత మంచి బ్యూటీ ఫుల్ లంగ్స్ స్పేస్ ఉండటం రేర్.


దీన్ని కచ్చితంగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యమంత్రి గారే విద్యా శాఖ మంత్రి కావటం మన ఖర్మ. ఆయనకు దీన్ని పట్టించుకునే సమయమే లేదు. బాల్ భవన్ లో 14 మంది డిప్యూటేషన్ మీద వచ్చిన స్టాఫ్ మాత్రమే ఉన్నారు. ఇప్పటి వరకు బాల్ భవన్ కు రూపాయి కూడా ఇవ్వలేదు. బాల్ భవన్ కు నిధులు ఇచ్చే వరకు జాగృతి పోరాటం చేస్తుంది. బాల్ భవన్ ను వదిలేస్తే ఇక్కడ చెత్త పేరుకుపోతోంది. ప్రైవేట్ పార్కింగ్ కు వాడుతున్నారు. ఇక అసాంఘిక కార్యకలాపాలు జరిగే విధంగా మనమే ఒక వేదిక ఇచ్చినట్లు అవుతుంది. ఈ లంగ్స్ స్పేస్ అనేది చాలా ముఖ్యం. దీనిని కాపాడుకోవటం పై ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలి.”








