పినపాక నియోజకవర్గంలోని అశ్వాపురం మండలం బీజీ కొత్తూరులోని సీతారామ ఎత్తిపోతల పథకం మొదటి పంపు హౌస్ ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్శించారు. అనంతరం బీజీ కొత్తూరు పంపు హౌస్ డెలివరీ సిస్టర్న్ వద్ద గల ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఉన్న మహిళా రైతులతో మాట్లాడారు.. ప్రభుత్వం తమకు బోనస్ ఇవ్వడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.











