కంపెనీ ప్రతినిధులకు ఫోన్ | (భువనగిరి)

ఉపాధి కోసం దక్షిణ ఆఫ్రికా వెళ్లి కిడ్నాపై ఉగ్రవాదుల చెరలో ఉన్న బండ సోమారం గ్రామానికి చెందిన ప్రవీణ్ కుటుంబ సభ్యులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం రాత్రి పరామర్శించారు. ప్రవీణ్ విడిపించే చర్యలు ఏం తీసుకుంటున్నారని కంపెనీ ప్రతినిధితో ఫోన్ లో మాట్లాడి ఆరా తీశారు. ఉగ్రవాదులు డబ్బు డిమాండ్ చేస్తున్నారా అని అడిగారు. అక్కడి భారత రాయబారితో మాట్లాడుతానని కవిత చెప్పారు. ప్రవీణ్ ను విడిపించేందుకు తాను చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు