తెలంగాణ జాగృతి ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జాగృతి బీసీ వింగ్ అధ్యయన కమిటీ సమావేశం జరిగింది. కమిటీ సభ్యులు కోల శ్రీనివాస్, బండారి లావణ్య, గొరిగే నర్సిహ కురుమ, తడి గోపుల సురేష్ గౌడ్, మల్లేష్, బండోజు మంజుల చారి పాల్గొని పలు అంశాలపై చర్చించారు. సమావేశంలో పాల్గొన్న స్టీరింగ్ కమిటీ సభ్యురాలు మంచాల వరలక్ష్మి సభ్యులకు పలు సూచనలు చేశారు. తమను కమిటీలో నియామించడం పట్ల తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవితక్కకు కృతజ్ఞతలు తెలిపారు.  ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ జాగృతి సంస్థ త్వరలో ఒక రాజకీయ పార్టీగా రూపాంతరం చెందనున్న క్రమంలో బీసీ విభాగ కమిటీని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని సభ్యులు అభిప్రాయపడ్డారు. బీసీలకు న్యాయం జరిగే విధంగా రాష్ట్రంలోనే ఒక కొత్త ఆలోచనతో ముందుకు పోయే విధంగా ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయించారు. బీసీ, ఎంబీసీ సంచార జాతులకు సరైన న్యాయం జరిగే విధంగా పార్టీ లక్ష్యాలను నిర్దేశించుకోవాలని చర్చించారు.  తమ నాయకురాలు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, బీసీ సమస్యలు, హక్కుల సాధన కోసం కృషి చేస్తానని అన్నారు. తెలంగాణ జాగృతి బలోపేతానికి, సంస్థ లక్ష్యాల సాధనకు అంకితభావంతో పనిచేస్తమని చెప్పారు.