తెలంగాణ జాగృతి చరిత్ర విభాగం సభ్యులు శనివారం సునీల్ సముద్రాల నేతృత్వంలో రాష్ట్ర చరిత్ర పరిశోధనకు సంబంధించిన కార్యాచరణ ప్రారంభించారు. కొత్త తెలంగాణ చరిత్ర బృందం వారు రవీంద్రభారతిలో నిర్వహించిన సెమినార్ కు హాజరై అక్కడ చరిత్ర పరిశోధకులను, కొంతమంది పెద్దలను కలుసుకొని చర్చించారు.  మున్ముందు జరగవలసిన కార్యాచరణ గురించి, ఇప్పటివరకు జరిగిన చరిత్ర పరిశోధన గురించి, ఇకముందు జరగవలసిన పరిశోధనల గురించి చర్చించారు. వీలైనంత తొందరగా వాటిని డాక్యుమెంట్ చేసి సమగ్ర నివేదికను రూపొందిస్తామని సునీల్ బృందం వెల్లడించింది.