పోచయ్య కుటుంబానికి కల్వకుంట్ల కవిత పరామర్శ

ఫోన్ చేసి ధైర్యం చెప్పిన టీఆర్ఎస్ చీఫ్

అటవీ శాఖ అధికారుల దాష్టీకంపై ఆగ్రహం

పోచయ్య కుటుంబాన్ని కలిసిన బట్టి అజయ్ — న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని భరోసా

(తెలంగాణ రక్షణ సేన, మెదక్):

మెదక్ జిల్లా రామాయంపేట మండలం పాతూరులో అటవీశాఖ అధికారుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న 55 ఏళ్ల పోచయ్య కుటుంబాన్ని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఫోన్లో పరామర్శించారు.  కుటుంబానికి న్యాయం జరిగే వరకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పోచయ్య కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ కష్ట సమయంలో కుటుంబం ఒంటరిగా లేదని, తెలంగాణ రక్షణ సేన పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

కుటుంబానికి న్యాయం జరిగే వరకు పార్టీ తరఫున పోరాటం కొనసాగుతుందని, అవసరమైన న్యాయపరమైన సహాయాన్ని పార్టీ లీగల్ టీమ్ ద్వారా అందిస్తామని కవిత హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ తో కూడా మాట్లాడి తగిన న్యాయం జరిగేలా చేస్తామని బాధిత కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ, వారి వెన్నంటే ఉంటామని స్పష్టం చేశారు. పోచయ్య మృతికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర దర్యాప్తు జరిపి, బాధ్యులు ఎవరైనా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన పార్టీ తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Telangana Rakshana Sena chief Kalvakuntla Kavitha assured support to Pochayya's family and demanded justice in the Medak incident.

భట్టి అజయ్ పరామర్శ

అటవీశాఖ అధికారుల వేధింపులకు ఉరివేసుకుని పోచయ్య ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటనపై తెలంగాణ రక్షణ సేన పార్టీ మెదక్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బట్టి అజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోచయ్య కుటుంబంలో శుభకార్యం ఉండటంతో, ఆయన చిన్న కుమారుడి భార్య సీమంతం కార్యక్రమం కోసం అవసరమైన కట్టెలను సమీపంలోని అడవిలో నుంచి తీసుకురావడానికి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో ఫారెస్ట్ బీట్ అధికారులు తమను అదుపులోకి తీసుకుని ఫారెస్ట్ రేంజర్ కార్యాలయానికి తీసుకెళ్లారని, అక్కడ తమపై చిత్రహింసలకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

ఈ ఘటనతో తీవ్ర మనోవేదనకు గురైన పోచయ్య అవమానం, బాధను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయి, నిష్పక్షపాత దర్యాప్తు జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలంగాణ రక్షణ సేన పార్టీ డిమాండ్ చేసింది.

ఈ కార్యక్రమంలో మెదక్ నియోజకవర్గ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కాశాపురం అశోక్ గారు, వేపూరి శ్రీనివాస్ గారు, అబ్బాస్ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని బాధిత కుటుంబానికి తమ సంఘీభావాన్ని తెలిపారు.