భద్రాద్రి-కొత్తగూడెె జిల్లాలో పర్యటిస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు, ఆలయ అధికారులు కవితకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం చేయించారు.. అనంతరం స్వామి వారి ప్రసాదం అందజేసి వేద ఆశీర్వచనం ఇచ్చారు.