భవన నిర్మాణ కార్మికుల సొమ్ము దారి మళ్లిస్తే ఊరుకోం
ప్రభుత్వానికి తెలంగాణ రక్షణసేన నాయకులు వీరన్న హెచ్చరిక
తెలంగాణ రాష్ట్ర భవన, నిర్మాణ సంఘం నూతన కమిటీ ఎన్నిక
అధ్యక్షుడిగా ఎత్తిరి గణేష్ నియామకం, 18 మంది సభ్యులతో రాష్ట్ర కమిటీ
(తెలంగాణ రక్షణసేన, హైదరాబాద్) :
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో ఉన్న కోట్ల రూపాయలను ప్రభుత్వం దారి మళ్లిస్తున్నదని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకుడు డి. వీరన్న మండిపడ్డారు. కార్మికుల పొట్టకొడుతూ వారి డబ్బులను దారి మళ్లించడం ఆపేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రక్షణసేన అనుబంధంగా తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆవిర్భావ సదస్సును బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీరన్న మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు అన్యాయం చేస్తోందని అన్నారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కమిటీని ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎత్తరి గణేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 18 మంది సభ్యులను ఈ సందర్భంగా నియమించారు. సంఘం అధ్యక్షునిగా ఎన్నికైన ఎత్తరి గణేష్ మాట్లాడుతూ తెలంగాణలో గ్రామ స్థాయి నుంచి భవన నిర్మాణ సంఘాన్ని బలోపేతం చేస్తామన్నారు. కార్మికులకు ఎప్పుడు, ఏ సమస్య వచ్చినా తెలంగాణ రక్షణ సేన అండగా ఉంటుందన్నారు. కార్మికులకు రావాల్సిన ప్రతి రూపాయి వచ్చే వరకు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత ఆధ్వర్యంలో పనిచేస్తామని చెప్పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు వరికుప్పల గంగాధర్, వెంకట్రావు, సుందర్ రావు, చలపతి రావు, రమణయ్య, తిరుపతి, శ్రీనివాస్, రాజు, శ్రీకృష్ణ, సురేష్, నవీన్, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.








