
తెలంగాణ జాగృతి ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల అధ్యయన కమిటి సభ్యులు డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్, ఐదా ప్రశాంత్ సోమవారం క్షేత్ర స్థాయిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించటానికి నాచారం ఈఎస్సై ఆసుపత్రిని సందర్శించారు. ఈఎస్సై ఆసుపత్రి లో అనేక డిపార్ట్మెంట్లలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆసుపత్రి సెక్యూరిటీ నుండి వార్డ్ బాయ్ వరకు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ అసిస్టెంట్లు, ఎక్స్ రే, టెక్నికల్ డిపార్ట్మెంట్లలో అనేకమంది వారి సేవలను అందిస్తున్నారు. వీరికి ఎనిమిది నెలలుగా ఎజెన్సీలు జీతాలు ఇవ్వటం లేదు. Go నంబర్ 60 కింద పనిచేస్తున్న వీరంతా జీతాలు లేక ఇంటి కిరాయిలు సైతం కట్టుకోలేని దుస్థితిని జాగృతి అధ్యయన బృందానికి తెలియజేసారు. ఇటీవల శాసన మండలిలో మా సమస్యలను లేవనేత్తిన కల్వకుంట్ల కవితక్కకు ఉద్యోగులంతా కృతజ్ఞతలు తెలిపారు. వారి సమస్యల కోసం అధ్యయన కమిటీ వేసిన కవితక్కకు ఋణపడి ఉంటామని వారు తెలియజేశారు.









