ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్తాన్ నోబెల్ బహుమతి కోసం తీర్మానం చేయడం దుర్మార్గం
-తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
(బంజారాహిల్స్ – తెలంగాణ జాగృతి కార్యాలయం)
ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్తాన్ తమ దేశానికి చెందిన ముగ్గురికి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని పార్లమెంట్ లో తీర్మానం చేయడం దుర్మార్గమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. శుక్రవారం ఈ మేరకు కవిత వీడియో సందేశం విడుదల చేశారు. భారత్ పై బాంబులు వేసిన టెర్రరిస్టులు హాఫీజ్ సయ్యద్, అజార్ మహమూద్ లకు కూడా భవిష్యత్ లో నోబెల్ ప్రైజ్ ఇవ్వమని పాకిస్తాన్ అడుగుతుందని మండిపడ్డారు. టెర్రరిస్ట్ దేశమైన పాకిస్థాన్ కు చెందిన వ్యక్తులకు నోబెల్ ప్రైజ్ కు ఎంట్రీ రావడం కూడా భారతీయులకు అవమానకరమని తెలిపారు.
పాకిస్తాన్ దుశ్చర్యలను, ఉగ్ర లింకులను నోబెల్ కమిటీకి తెలిసేలా ట్విట్టర్ సహా ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా తెలియజేయడం ప్రతి భారతీయుడి బాధ్యత అని చెప్పారు.








