జాగృతి జనంబాటలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శనివారం నాగర్‌కర్నూల్ జిల్లాలో పర్యటించారు. బిజినేపల్లి మండలం వట్టేం రిజర్వాయర్, పంపు హౌస్ ను పరిశీలించారు. 

గతంలో వరదలో పంపు హౌస్ మునగడంతో భవిష్యత్తులో అలాంటి పరిస్థితి రాకుండా ఎలాంటి చర్యలు చేపట్టారని ఆరా తీశారు. పంపు హౌస్ లో పంపుల డ్రై రన్ సహా ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు.