భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జాగృతి జనంబాట
ఇల్లందు మండలం సత్యనారాయణపురంలోని హజ్రత్ నాగూల్ మీరా దర్గాను గురువారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్శించారు. జాగృతి జనంబాటలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కవిత పర్యటించారు. ఇల్లందు మండలం సత్యనారాయణపురం హజ్రత్ నాగూల్ మీరా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అదే ప్రాంగణంలో ఉన్న సీతారామచంద్రుల ఆలయాన్ని దర్శించుకున్నారు.












