నాగర్ కర్నూల్ పట్టణంలోని విద్యానగర్ లో ప్రముఖ సాహితీవేత్త దివంగత కపిలవాయి లింగమూర్తి నివాసాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రచనలకు సంబంధించిన తాళపత్ర గ్రంథాలను పరిశీలించారు. లింగమూర్తి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆయన రచనలు సహా ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు.











