రామంతాపూర్ లో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నిర్వహించిన రథ యాత్రలో విద్యుత్ షాక్ తో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. బాధిత కుటుంబాలకు వెంటనే పరిహారం చెల్లించి కుటుంబ సభ్యులకు ఉద్యోగమివ్వాలని కవిత డిమాండ్ చేశారు.

” కృష్ణాష్టమి సందర్భంగా కరెంట్ తీగలు తగిలి…రామాంతపూర్ లోని అయ్యప్పగుడి వద్ద ఉన్న ఐదుగురు మృతి చెందారు. కరెంట్ తీగలు కిందకు వేలాడటం కారణంగానే వారు చనిపోయారు. ఇది ప్రభుత్వం, ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్ వారి తప్పు కారణంగా జరిగింది. కనుక చనిపోయిన వారి కుటుంబాలకు వెంటనే ఎక్స్ గ్రేషియాను రిలీజ్ చేయాలి. 

చనిపోయిన వాళ్లంతా కూడా యువకులు. వారందరికీ వారిపై ఆధారపడిన కుటుంబం ఉంది. కనుక ప్రభుత్వం పెద్ద మనసు చేసుకోని పదిలక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి. అదే విధంగా వారి కుటుంబంలో వారికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్ వారు ఉద్యోగం ఇవ్వాలి. ఎంతో మందికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగాలు ఇస్తున్నారు. కాంట్రాక్ట్ లేదా ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలి.. మృతుల కుటుంబాలకు సాయం చేసే విషయంలో కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. 

చనిపోయిన వారిలో యాదవులు సహా ఇతర కులాలకు చెందిన వారు కూడా ఉన్నారు. వారి కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మా సంస్థ తరఫున కూడా వీలైనంత సాయం మేము చేస్తాం. మా మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ఇదివరకే బాధితులను పరామర్శించి మళ్లీ వస్తామని కూడా చెప్పారు. సంఘటన జరిగి నాలుగు నెలలైనా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. వెంటనే బాధిత కుటుంబాలకు ఇవ్వాల్సిన పరిహారం ఇవ్వాలి.”