తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో శుక్రవారం తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత భేటీ అయ్యారు. 4 నెలల కిందట ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినప్పటికీ ఆమోదం కాకపోవడంతో ఆమె నేరుగా ఛైర్మన్ ను కలిసి చర్చించారు. తన రాజీనామాకు కారణాలను హౌస్ లో చెప్పే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
” నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి నాలుగు నెలలైంది. అయినా నా రాజీనామాను ఆమోదించలేదు. నా రాజీనామాను ఆమోదించాలని శాసన మండలి ఛైర్మన్ ను కోరాను. అదే విధంగా రాజీనామా ఆమోదానికి ముందు నాకు కౌన్సిల్ లో మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరాను. ఈ నెల 5 వ తేదీన నాకు మాట్లాడే అవకాశం ఇస్తామన్నారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నా రాజీనామాకు కారణాలను ఆ రోజే తెలంగాణ ప్రజలకు తెలియజేస్తాను. పార్లమెంటరీ ప్రొసిజర్స్ కు కచ్చితంగా మనం ఫాలో అవ్వాలి. కొత్త సంవత్సరంలో కోరుకున్న పనులన్నీ నెరవేరాలని ఆడబిడ్డగా ఆకాంక్షిస్తున్నా.”








