ఇటీవల గుండెకు సంబంధించిన వ్యాధితో బాధ పడుతున్న బాలుడికి మాజీ ఎంపి, తెలంగాణ జాగృతి అధినేత్రి  కల్వకుంట్ల కవిత చొరవతో వైద్య చికిత్స పొందిన ఓ కుటుంబం మంగళవారం కవితను కలిశారు. సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ గ్రామానికి చెందిన ఏక్తాపూర్ పండిత్-పార్వతమ్మ దంపతుల కుమారుడు శివానంద్ (17) గుండెకు సంబంధించిన సమస్యతో బాధ పడుతుండగా చిన్నారికి ఆపరేషన్ కోసం అతడి తల్లిదండ్రులు కవితను సంప్రదించారు. ఆమె చొరవ తీసుకుని నిమ్స్ ఆసుపత్రి లో 2025 డిసెంబర్ 17న ఆపరేషన్ చేయించారు. ఆ తర్వాత కోలుకున్న శివానంద్ తన తల్లిదండ్రులతో కలిసి మంగళవారం బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవితను కలిశారు. ఈ సందర్భంగా ఆ బాలున్ని పరామర్శించిన కవిత త్వరలోనే పూర్తి స్థాయిలో కోలుకొని చదువు కొనసాగించాలని ధైర్యం చెప్పారు. వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.