తెలంగాణ జాగృతి కార్యాలయం – బంజారాహిల్స్

బంజారాహిల్స్ జాగృతి కార్యాలయంలో కల్వకుంట్ల కవిత గారు పాల్గొన్న కార్యక్రమం

కవిత గారి కామెంట్స్

అమరులను స్మరించుకుంటూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించాం. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను కార్యక్రమంలో తలుచుకోవటం జరిగింది. కేసీఆర్ గారి దీక్ష, అమరుల బలిదానాలు, విద్యార్థుల త్యాగాలు, తెలంగాణ ప్రజలు చేసిన ఉద్యమం ద్వారా తెలంగాణ తెచ్చుకున్నాం. 

కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పటికీ ఉద్యమకారులను అప్పటి ఎమ్మెల్యేలు, మంత్రులు పట్టించుకోలేదు. రాష్ట్ర సాధన కోసం త్యాగాలు చేసిన వారిని గౌరవించకపోవటం అందరినీ బాధించింది. ఉద్యమంలో మనమే 12 వందల మంది అమరులయ్యారని చెప్పాం. కానీ కేవలం 540 కుటుంబాలకు మాత్రమే సాయం చేశాం. వారికి కూడా కనీస గౌరవం ఇవ్వలేదు. రాష్ట్రావతరణ రోజున పిలిచి శాలువ కూడా కప్పలేదు. వారికి గుర్తింపు కార్డులు, గౌరవం ఇవ్వలేదన్న బాధ ప్రజల్లో ఉన్నట్లు జనంబాటలో తిరుగుతున్నప్పుడు నేను గమనించటం జరిగింది. 

కేసీఆర్ గారి ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను మేము సరిచేస్తామని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు, పెన్షన్లు, 250 గజాల స్థలం ఇస్తామని హామీ ఇచ్చింది. 

ముఖ్యమంత్రి గారు ఉద్యమకారులకు చెప్పిందినట్లు చెప్పినట్లుగా డిసెంబర్ 9 నాడు అనౌన్స్ చేయాలి. ఉద్యమకారులకు పెన్షన్లు, గుర్తింపు కార్డులు ఇచ్చే ప్రక్రియ ప్రారంభించాలి. అప్లికేషన్స్ పెట్టుకోవాలంటూ రెండేళ్లుగా మీరు కాలయాపన చేస్తున్నారు. 

కనీసం రాష్ట్రావతరణ రోజున ఉద్యమకారులు, వారి కుటుంబాలను గౌరవించిన పాపాన పోలేదు. మేము డిమాండ్ చేస్తే గానీ అమరుల స్థూపం వద్దకు వెళ్లలేదు. జై తెలంగాణ అనలేదు. మీరు ఇవ్వాళ తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారంటే అమరుల పోరాటమేనని గుర్తించాలి. వారికి మీరు చేసిన వాగ్దానాలన్నీ కూడా నిలబెట్టుకోవాలి. 

డిసెంబర్ 9 నాడు సీఎం  ఉద్యమకారులకు 250 గజాల చొప్పున భూములు ఇస్తున్నట్లు ప్రకటించకపోతే జాగృతి తరఫున భూపోరాటాలు ప్రారంభం చేస్తాం. ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంటే అక్కడకు ఉద్యమకారులను తీసుకెళ్లి వారికి ఆ భూమిని పంచుతాం

మా రక్తం, చెమట ధారబోసి తెలంగాణ తెచ్చాం. అలాంటి వారందరికీ కూడా భూములు దక్కాల్సిన అవసరముంది. ఉద్యమకారుల కోసం చేసే భూపోరాటంలో భూమి ఎక్కడ ఉంటే అక్కడ జాగృతి జెండాలు కూడా పాతుతాం డిసెంబర్ 9 నాడు ముఖ్యమంత్రి గారు ఇందుకు సంబంధించి ప్రకటన చేయాలి. లేదంటే జాగృతి తరఫున భూ పోరాటాలు ప్రారంభమవుతాయని హెచ్చరిస్తున్న.