ఉద్యమకారుల గుర్తింపుకు అధ్యయనం ప్రధానం

స్వతంత్రత సైనిక్ సమ్మాన్, హైదరాబాద్ లిబరేషన్ మూమెంట్ రూల్ పొజిషన్ ను కమిటీ స్టడీ చేయాలి

కాలయాపన కమిటీ కాదని నిరూపించాలి

ఉద్యమకారుల కోసం బీఆర్ఎస్ లో అంతర్గతంగా పోరాటం చేసి బలైన వ్యక్తిని నేను

-తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత

కేశవరావు కమిటీకి నివేదిక అందజేత

(తెలంగాణ రక్షణసేన, అమరజ్యోతి-హైదరాబాద్)

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకు స్పూర్తిగా నిలిచిన భారత స్వాతంత్ర్య పోరాటాన్ని ప్రామాణికంగా తీసుకుని తెలంగాణ ఉద్యమకారులను గుర్తించాలని తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత కోరారు. ఉద్యమకారులను గుర్తించడానికి కే.కేశవరావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ ముందు మంగళవారం హాజరైన కవిత టీఆర్ఎస్ పక్షాన తమ నివేదిక అందజేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ..తెలంగాణ ఉద్యమకారులను గుర్తించటం, గౌరవించటం కోసం కమిటీ ఏర్పాటు చేయటం సంతోషమన్నారు. తాను తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులతో భుజం భుజం కలిపి పోరాటం చేసిన వ్యక్తినన్నారు. గత ప్రభుత్వంలో ఉద్యమకారులకు అన్యాయం జరిగిందంటూ అంతర్గత వేదికల్లో చెప్పి వారి కోసం పోరాటం చేశానని గుర్తు చేశారు. దాని పర్యవసానంగానే బీఆర్ఎస్ లో బలయ్యానని కవిత వెల్లడించారు. ఉద్యమంలో ఉన్న భావోద్వేగపూరితమైన అంశాలను రూల్ పొజిషన్ గా కన్ వర్ట్ చేయాల్సిన బాధ్యత ఈ కమిటీ మీద ఉందని సూచించారు. మన స్వతంత్ర పోరాటంలో కూడా కోట్ల మంది పాల్గొన్నారని తెలిపారు. రకరకాల భావజాలాలు ఉన్నప్పటికీ అంతా స్వతంత్ర పోరాటంలో ఒక్కటిగా ఫైట్ చేశారని వివరించారు. అప్పుడు కొట్ల మంది ఉద్యమంలో పాల్గొంటే లక్షల మందికి మాత్రమే గుర్తింపు వచ్చిందన్నారు. ఆ సంఖ్య తక్కువైనప్పటికీ ఆ స్ఫూర్తి మాత్రం గొప్పదని తెలిపారు. భారత ప్రభుత్వం స్వతంత్రత సైనిక్ సమ్మన్ యోజన పేరుతో లక్షా 71 వేల మందికి పెన్షన్లు ఇచ్చిందని కవిత గుర్తు చేశారు. వాళ్లు చనిపోయిన తర్వాత కూడా ఆ కుటుంబానికి మేలు జరిగేలా రూల్ పొజిషన్ ఉందని, దాన్ని కమిటీ స్టడీ చేయాలని కోరారు. ఆ స్కీమ్ పెట్టినప్పుడు ఒక్క బ్రిటీష్ ప్రభుత్వంపైనే కాకుండా ఫ్రెంచ్, పోర్చుగీస్ వాళ్లపై పోరాటం చేసిన వాళ్లను కూడా గుర్తించారని గుర్తు చేశారు. 1969 ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను కూడా ఇందులో జత చేయాలని సూచించారు. సాయుధ రైతాంగ పోరాటం నాటి ఉద్యమకారులను కూడా కలపాలని కొంతమంది అంటున్నారన్నారు. కానీ సాయుధ రైతాంగ పోరాటాన్ని భారత ప్రభుత్వం హైదరాబాద్ లిబరేషన్ మూమెంట్ గా గుర్తించిందని కవిత తెలిపారు. ప్రత్యేకంగా రూల్ పొజిషన్ పెట్టి 7 వేల మందికి పెన్షన్లు ఇచ్చిందని చెప్పారు. అవసరమైతే ఆ రూల్ పొజిషన్ ను కూడా స్టడీ చేయాలన్నారు. అప్పట్లో ఆర్య సమాజ్ వాళ్లు ఇచ్చిన సూచనలను భారత ప్రభుత్వం గమనంలోకి తీసుకుందని వివరించారు. ఝార్ఖండ్ లో మాదిరిగా గుర్తింపు కార్డులు ఇచ్చి ఉద్యమకారులను గౌరవించాలి.

తెలంగాణ ఉద్యమంలో కూడా ఎన్నో సంఘాలు పనిచేశాయని, వారి రికమండేషన్లను కూడా గమనంలోకి తీసుకోవాలని కోరారు. 

Telangana Rakshana Sena Chief Kalvakuntla Kavitha submits a report to the K. Keshava Rao Committee, advocating rule-based recognition and welfare benefits for Telangana movement activists.

జైలుకెళ్లిన వారికి ప్రాధాన్యం

 ఉద్యమంలో జాగృతి సంస్థ ద్వారా పెద్ద ఎత్తున పోరాడామని, ఎన్నో వేల మంది ఉద్యమకారుల జాబితా తమ వద్ద ఉందని కవిత వెల్లడించారు. సంఖ్య పెరుగినా ఉద్యమంలో పాల్గొన్న వారి పట్ల విశాల హృదయంతో పనిచేయాలని సూచించారు. 

స్వతంత్ర ఉద్యమంలో ఆరు నెలలు జైల్లో ఉన్నవారికి ముందుగా ప్రాధాన్యం ఇచ్చారని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కూడా జైల్లో ఉన్నవాళ్లు, ఎఫ్ఐఆర్ లు, ఛార్జిషీట్లు నమోదైన వాళ్ల విషయంలో ఆలస్యం చేయకుండా వారిని గుర్తించాలని సూచించారు. 

మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు కూడా వెసులుబాటు కల్పించారని, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు అలాంటి వెసులుబాటు ఇవ్వాలని కోరారు. 

స్వతంత్ర ఉద్యమంలో అండర్ గ్రౌండ్ పీరియడ్ ను కూడా కన్సిడర్ చేశారని, హౌస్ అరెస్ట్ అయిన వాళ్లను కూడా గమనంలోకి తీసుకున్నారని చెప్పారు. ప్రాపర్టీ లాస్, డిసేబిలిటీ, పోలీస్ అట్రాసిటీ అనుభవించిన వాళ్లను వెంటనే గుర్తించాలని చెప్పారు. పదిసార్లు లాఠీ దెబ్బలు తిన్న వాళ్ల విషయంలో వెంటనే వారికి గుర్తింపు ఇవ్వాలన్నారు. రాజేష్ నాయక్, యాకుబ్ రెడ్డి లాంటి వాళ్లు ముళ్లకంపపై పడి బతుకులు ఆగం చేసుకున్నారన్నారు. అలాంటి వాళ్ల విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాళ్లను గుర్తించాలని కోరారు. ఉద్యమంలో జాబ్ పోయిన వాళ్లకు మేలు చేయాలని గవర్నమెంట్ ఆర్డర్ కూడా ఉందని కవిత గుర్తు చేశారు. మన ముందే ఇద్దరు కానిస్టేబుళ్లు ఉద్యోగం కోల్పోయారని, ఎంతో మంది టీచర్లను ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల ఉద్యమంలో పాల్గొన్న వాళ్ల డీలర్ షిప్ లను క్యాన్సల్ చేయించారని తెలిపారు. వాళ్లందరి విషయంలో కమిటీ మానవతా దృక్పథంతో ఆలోచించాలని కోరారు. ఉద్యమకారులు ఎవరైనా చనిపోతే మొదటి ప్రాధాన్యం వాళ్ల భార్య, లేదంటే పిల్లలు, తల్లితండ్రులకు ఇవ్వాలని కవిత సూచించారు. ఏ స్కీమ్ పెట్టినా సరే స్కామ్ అవుతున్నదని, అందుకే ఉద్యమకారుల గుర్తింపు విషయం అలా జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. 

Kalvakuntla Kavitha submitted a report to the K. Keshava Rao Committee, urging transparent and rule-based recognition of Telangana movement activists by adopting proven national models and ensuring welfare benefits.

2014 నుంచే ప్రయోజనాలు

ఉద్యమకారుల విషయంలో తోటి ఖైదీని అడగటంతో పాటు విద్యావంతుల వేదికలో పాల్గొన్న వాళ్ల ద్వారా ఉద్యమకారుల వివరాలు తీసుకోవాలని కవిత సూచించారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 30 నెలల తర్వాత కమిటీ ఏర్పాటు చేయటం విచారకరమని అభిప్రాయపడ్డారు. ఈ ముఖ్యమంత్రి ఉద్యమంలో లేనప్పటికీ కోదండరాం, అద్దంకి దయాకర్, రాములు నాయక్ లాంటి వాళ్ల మాటలు నమ్మి కాంగ్రెస్ కు ఉద్యమకారులు సపోర్ట్ చేశారని చెప్పారు. కానీ ఉద్యమకారులు భిక్షాటన చేసి ఆందోళనలు చేసిన తర్వాత గానీ కమిటీ ఏర్పాటు చేయలేదన్నారు. ఉద్యమకారుల విషయంలో మీరు నిర్ణయం ఎప్పుడు తీసుకున్నా సరే అధికారంలోకి వచ్చిన తేదీ నాటి నుంచే వారికి ప్రయోజనాలు అందించాలని కోరారు.  భావన ఉందని అది తప్పని ఈ కమిటీ నిరూపించాలని కోరారు. ఒక కాలపరిమితి విధించుకుని ఉద్యమకారులను గుర్తించి వారికి ఏ విధంగా మేలు చేస్తారో చెప్పాలని సూచించారు.