పీవీ సింధూకు టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు
జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నీ గెలిచిన సింధూ
థ్యాంక్స్ అక్క అంటూ రిప్లయ్ ఇచ్చిన వీవీ సింధూ
(తెలంగాణ రక్షణసేన, హైదరాబాద్) :
జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్లో సరికొత్త చరిత్ర సృష్టించి, టైటిల్ గెలిచిన తొలి భారతీయురాలు స్టార్ షట్లర్ పీవీ సింధును తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత లింక్డ్ ఇన్ లో అభినందించిన సంగతి తెలిసిందే. ఐతే కవిత పోస్టుకు పీవీ సింధూ రిప్లయ్ ఇచ్చారు. దాదాపు రెండేళ్లుగా ఎంతో కష్టమైన సమయాన్ని ఎదుర్కొన్నానని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు. వీపీ సింధూను ప్రశంసిస్తూనే ఆమె గత రెండేళ్లలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్న సంగతిని కవిత ప్రస్తావించారు. ఆ సమయంలో మద్దతుగా ఉండాల్సిన చాలా మంది ఆమె కెరీర్ పైనే అనుమానాలు వ్యక్తం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడాకారులు కష్టాల్లో ఉన్నప్పుడు ఏ విధంగా మద్దతు తెలిపామన్నదే ముఖ్యమని… అలాంటి సమయంలో వారికి అండగా నిలబడటమే నిజమైన క్రీడాస్ఫూర్తి అని అన్నారు. ఎన్నో విమర్శలు, కెరీర్ పరంగా దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ అచంచలమైన ఆత్మవిశ్వాసంతో పీవీ సింధూ మళ్లీ అగ్రస్థానానికి చేరుకోవడం గర్వకారణమని కవిత అన్నారు. కవిత తనకు తెలిపిన మద్దతుపై పీవీ సింధూ ఆనందం వ్యక్తం చేశారు. తాను గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పుడైనా విజయాల పరంపరంలో ఉన్నప్పుడైనా తనకు ధైర్యం చెబుతూ ప్రోత్సహించే వ్యక్తుల్లో కవితక్క ఒకరు అంటూ పీవీ సింధు కృతజ్ఞతలు తెలిపారు.








