సేవాలాల్ మహారాజ్ స్ఫూర్తితో  యువత ముందుకు సాగాలని తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్ నాయక్ అన్నారు. ఆదివారం బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో నిర్వహించిన బంజారా జాగృతి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫిబ్రవరి 15న  సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఈ సమావేశంలో తీర్మానం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బంజారా సమాజాన్ని విస్మరిస్తోందని రూప్ సింగ్ విమర్శించారు. గతేడాది సేవాలాల్ జయంతికి ఇవ్వాల్సిన నిధులను ఇప్పటివరకు విడుదల చేయలేదని అన్నారు. గతేడాది పెండింగ్ నిధులతో పాటు ఈ సంవత్సరానికి సంబంధించిన నిధులు కలిపి రూ.4 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బంజారా జాగృతి అధ్యక్షుడు రవీందర్ నాయక్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో నాయకులు కిషన్ నాయక్, సంజీవ్ నాయక్, కల్యాణ్ నాయక్, రాంజీ నాయక్, పున్నిబాయి, రవి రాథోడ్, దేవీ బాయి, ఎస్ పీ నాయక్, శివరామ్ మహరాజ్, కిషన్ మహరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Banjara Jagruthi meeting at Telangana Jagruthi office