సిద్ధిపేట నియోజకవర్గానికి చెందిన ఎపీటీసీ మాజీ  సభ్యుడు ఎస్. శ్రీనివాస్ నేతృత్వంలో మిట్టపల్లికి చెందిన 15 మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం తెలంగాణ జాగృతిలో చేరారు. హైదరాబాద్ లోని జాగృతి ప్రధాన కార్యాలయంలో అధినేత్రి కల్వకుంట్ల కవిత వారికి కండువా కప్పి ఆహ్వానించారు. సామాజిక తెలంగాణ సాధనలో కలిసి నడవాలని ఆమె పిలుపునిచ్చారు. మిట్టపల్లి ఎంపీటీసీ మాజీ సభ్యుడు శ్రీనివాస్ మాట్లాడుతూ సిద్ధిపేట నియోజకవర్గంలో నిజాయితీగా పనిచేసే కార్యకర్తలకు బీఆర్ఎస్ లో గుర్తింపు, గౌరవం లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కవితక్క నాయకత్వంలో పనిచేయడానికి ఎంతోమంది ఎదురు చూస్తున్నారని చెప్పారు. జాగృతిలో చేరిన వారిలో మాజీ ఎంపీటీసీ ఎస్.శ్రీనివాస్, బీసీ సంఘం జిల్లా కార్యదర్శి వి.శ్రీనివాస్, సంతోష్, యాదగిరి, బాలయ్య, ఆర్. యాదగిరి, చారి, నాగరాజు, నాంపల్లి, కనకయ్య, మహేందర్, సుదర్శన్, రామచంద్రం, రాజు, సాయి తదితరులున్నారు.