సూర్యాపేట జిల్లా నుంచి జాగృతిలో భారీ చేరికలు

(హైదరాబాద్) :

సూర్యాపేట జిల్లాలో వివిధ పార్టీల నుంచి నాయకులు తెలంగాణ జాగృతిలో చేరారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వందమంది శుక్రవారం హైదరాబాద్ జాగృతి కేంద్ర కార్యాలయంలో జాగృతి సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు ఎస్ కృష్ణవేణి, సీనియర్ నేత సయ్యద్ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో అధినేత్రి కల్వకుంట్ల కవిత జాగృతిలోకి ఆహ్వానించారు. భవిష్యత్తులో కవితక్క పెట్టే రాజకీయపార్టీలో కలిసి పని చేయడం కోసం సిద్ధమై జాగృతిలో చేరుతున్నట్టు నాయకులు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా నేత మందడి సోమిరెడ్డి, బీజేపి జిల్లా నేత ఉప్పలాచారి, మాజీ జడ్పీటీసీ బాలాజీ నాయక్, బీఆర్ఎస్ జిల్లా మహిళా నాయకురాలు జ్యోతిరెడ్డి, నాగమణి, యూత్ కాంగ్రెస్ నేత పిట్టల మహేష్ తో పాటు తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాలకు చెందిన 100మంది జాగృతిలో చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఉమా రాణి, శ్యామ్ నాయక్, సతీశ్, సాయి చాంద్, రాంజీ తదితరులు పాల్గొన్నారు.