హైదరాబాద్ బాగ్ లింగంపల్లి లోని ఆర్ టీసీ కళ్యాణ మండపంలో గురువారం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ జరిగింది. సభకు హాజరైన జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాల వేసి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి నివాళులర్పించారు.
తెలంగాణ అమరవీరులకు 2 నిమిషాలు మౌనం పాటించి తెలంగాణ ఉద్యమకారులు నివాళులర్పించారు. వివిధ జిల్లాల నుంచి ఉద్యమకారులు, విద్యార్థులు భారీగా హాజరయ్యారు.









