తెలంగాణ జాగృతి ప్రధాన కార్యాలయంలో శుక్రవారం తెలంగాణ జాగృతి ఇంటలెక్చువల్ సపోర్ట్ అధ్యయన కమిటీ సమావేశం అయ్యింది ! అర్చనా సేనాపతి, తానిపర్తి తిరుపతి రావు అధ్వర్యంలో ద్విసభ్య కమిటీ గత వారంరోజులుగా వివిధ వర్గాల నుండి సేకరించిన అభిప్రాయాలను క్రోడీకరించి తుది నివేదికను స్టీరింగ్ కమిటీ సభ్యులు సయ్యద్ ఇస్మాయిల్, లోక రవిచంద్ర, ఎం.వరలక్ష్మికి అందజేసింది.