తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో గుర్తింపు పొందిన అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో నాగోబా దేవాలయాన్ని తెలంగాణ జాగృతి నాయకులు శుక్రవారం సందర్శించారు. అనంతరం భక్తిశ్రద్ధలతో నాగశేషుడికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో ఆదివాసీల ప్రత్యేక జాతర అయిన నాగోబా జాతరకు విచ్చేసి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నట్లు నాయకులు తెలిపారు. ఆదివాసులు ఎంతో భక్తిశ్రద్ధలతో నియమనిష్ఠలతో కొలిచే నాగోబా దేవాలయంలోని నాగ శేషుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని ఆకాంక్షించారు. ఇందులో తెలంగాణ జాగృతి నాయకులు, తెలంగాణ రాష్ట్ర ఆదివాసి అధ్యక్షుడు లోకిని రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వరలక్ష్మి, రాష్ట్ర అధికార ప్రతినిధి మనోజ, రాష్ట్ర నాయకులు గోపు సదానందం, బండారి లావణ్య, ఆదిలాబాద్ జిల్లా నాయకులు వేణుగోపాల్ యాదవ్, ఎర్రం సంతోష్ తదితరులు ఉన్నారు.











