కవితను కలిసిన కళాకారులు

Kalvakuntla Kavitha meeting Telangana movement artists seeking government jobs

 తెలంగాణ ఉద్యమ కళాకారులకు ఉద్యోగాల కోసం ఫోరంగా ఏర్పడి పోరాటం చేస్తున్న వారికి తెలంగాణ జాగృతి సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. తెలంగాణ రావడానికి ప్రధాన పాత్ర పోషించిన కళాకారులకు అండగా ఉంటామని చెప్పారు. తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం సభ్యులు  సోమవారం కవితను కలిశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పనిచేసిన కళాకారులకు తెలంగాణ సాంస్కృతి సారథిలో ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఉద్యమ కళాకారులకు ఉద్యోగాలిస్తాం అని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఉద్యోగాలు కల్పించలేదని విమర్శించారు. కళాకారులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ  ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండేళ్లు అవుతున్నా ఇంతవరకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఇందిరా పార్క్ వద్ద కళాకారులు చేపట్టే ధర్నాలో తెలంగాణ జాగృతి పాల్గొంటుందని ప్రకటించారు.