తెలంగాణ జాగృతి మహిళా సంక్షేమ అధ్యయన కమిటీ సభ్యులు ప్రభుత్వ పథకాలు, వాటి అమలు తీరుపై పరిశీలన ప్రారంభించారు. జాగృతి రాష్ట్ర కార్యదర్శి, జాగృతి మహిళా కమిటీ సభ్యులు భవాని వేముల, రజిత, రేణుకలు సోమవారం మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పీఏ , ఓఎస్డిలను తెలంగాణ సచివాలయంలో కలిశారు.
ఈ సందర్భంగా ప్రస్తుత ప్రభుత్వంలో అమలులో ఉన్న మహిళా సంక్షేమ పథకాలు, వాటి ద్వారా మహిళలకు అందుతున్న లబ్ధి, సౌకర్యాలపై వివరంగా చర్చ జరిగింది. మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ఈ పథకాలు ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు.
మహిళా సంక్షేమ పథకాలపై అవగాహనను గ్రామస్థాయి వరకు విస్తరించాల్సిన అవసరం ఉందని మహిళా కమిటీ సభ్యులు తెలిపారు.









