-కల్వకుంట్ల కవిత

కార్వాన్ లో జాగృతి జనంబాట

మూసీ రివర్ ఫ్రంట్ పేరిట ప్రపంచ బ్యాంకు నిధులతో నదిని సుందరీకరించే ముందు మూసీ పరీవాహక ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన అవసరముందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కార్వాన్ నియోజకవర్గంలో జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా జియాగూడ స్లాటర్ హౌస్ ను ఆమె సందర్శించారు. స్లాటర్ హౌస్ ను ఆధునీకరించడం వల్ల పరిసర ప్రాంతాలు ఆరోగ్యంగా ఉంటాయని చెప్పారు.

“జియాగూడ స్లాటర్ హౌస్ కు వస్తుంటే కరన్ సింగ్ రోడ్డు నుంచి ఇక్కడి వరకు రోడ్డు మీదనే మేకలు అమ్ముతున్నారు. ఇక్కడి 100 ఫీట్ల రోడ్డును దేని కోసమో తవ్వి వదిలేశారు. ఇప్పుడు ఆ వైపే రోడ్డు లేకుండా పోయింది. ఇదే రోడ్డులో జడ్జిలు, లాయర్లు పోతుంటారు. అట్లాంటి రోడ్డులో కూడా కనీస సౌకర్యాలు లేవు. ఓ వైపు మూసీ బఫర్ జోన్ పేద ప్రజల, ఇటు వైపేమో సరైన సౌకర్యాలు లేవు. దీని మీద ప్రభుత్వం కచ్చితంగా దృష్టి పెట్టాలి.”

“అదే విధంగా మనం హైయ్యెస్ట్ మీట్ ఈటర్స్. మన సంస్కృతి లో అది భాగం. అరె కటిక వాళ్లతో పాటు చాలా మంది అనేక కులాల వాళ్లు ఈ వ్యాపారం చేసుకుంటున్నారు. వారికి సంబంధించి మోడ్రన్ స్లాటర్ హౌస్ లు రావల్సిన అవసరముంది. తెలంగాణ వచ్చిన తర్వాత కొన్ని మోడ్రన్ స్లాటర్ హౌస్ లు కట్టుకోవటం జరిగింది. కానీ ఏషియా బిగ్గెస్ట్ మండిలో మాత్రం స్లాటర్ హౌస్ లు కట్టుకోలేకపోయాం. దాని కోసం రూ. 56 కోట్లు సాంక్షన్ అయ్యాయంట. ఎంత ఖర్చు అయినా సరే స్లాటర్ హౌస్ లు కట్టాల్సిందే. ఇక్కడ వానాకాలం వస్తే పరిస్థితి భయంకరంగా ఉంటున్నది. నేను కొన్ని వీడియోలు కూడా చూశాను. మంచి స్లాటర్ హౌస్ లు నిర్మిస్తే వ్యాపారం చేసే వాళ్లంతా కూడా మార్కెట్ లోకి వస్తారు. రోడ్ క్లియర్ అవుతోంది. మూసీ రివర్ ఫ్రంట్ అంటూ ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్ నుంచి వేల కోట్ల రూపాయలు తెచ్చే ప్రయత్నం చేస్తున్నది. అలా బ్యూటిఫికేషన్ ఇక్కడ జరగాలంటే మోడ్రన్ స్లాటర్ హౌస్ లు రావాలి.”