తనకు అభివాదం చేసి బైక్ పైనుంచి కిందపడ్డ తండ్రీ కూతురు – వెంటనే స్పందించి దవాఖానకు తరలించిన కవిత
యాదాద్రి పర్యటనలో ఘటన | (నారపల్లి)
జాగృతి జనంబాటలో భాగంగా యాదాద్రి-భువనగిరి జిల్లా పర్యటనలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మానవత్వాన్ని చాటుకున్నారు. బైక్ పై నుంచి కింద పడ్డ తండ్రీ కూతురిని దగ్గరుండి ఆసుపత్రికి తరలించారు కవిత. జిల్లా పర్యటనకు వెళ్తుండగా ఆమెకు అభివాదం చేసేందుకు ప్రయత్నించి తండ్రీ, కూతురు అదుపు తప్పి బైక్ పై నుంచి కింద పడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటనలో భాగంగా బీబీ నగర్ ఎయిమ్స్ కు వెళ్తుండగా నారపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే కవిత తన వాహనం ఆపి కింద పడిన తండ్రీకుమార్తె వద్దకు వెళ్లి పరామర్శించారు. స్వల్ప గాయాల పాలైన వారికి ధైర్యం చెప్పారు. తన కాన్వాయ్ లోని వాహనంలో స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు కవిత. తండ్రీకుమార్తెలకు ప్రథమ చికిత్స చేసి ప్రమాదం లేదని డాక్టర్లు వెల్లడించారు. వారికి పూర్తిస్థాయి వైద్యసేవలు అందించడానికి జాగృతి నాయకులు ఆసుపత్రిలోనే ఉన్నారు.












